News March 23, 2024

బిగ్‌బాస్ విన్నర్‌కు బెయిల్

image

పాము విషం సరఫరా కేసులో అరెస్టైన బిగ్‌బాస్ ఓటీటీ2 విన్నర్, యూట్యూబర్‌ ఎల్విశ్ యాదవ్‌కు బెయిల్ మంజూరైంది. నోయిడా జైలులో ఉన్న ఆయనకు గురుగ్రామ్ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. మార్చి 17న ఎల్విశ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Similar News

News July 11, 2025

శుభ సమయం (11-07-2025) శుక్రవారం

image

✒ తిథి: బహుళ పాడ్యమి రా.2.02 వరకు తదుపరి పాడ్యమి
✒ నక్షత్రం: పూర్వాషాడ ఉ.6.29 వరకు తదుపరి ఉత్తరాషాడ
✒ శుభ సమయం: ఉ.10.25-ఉ.10.55 వరకు తిరిగి సా.5.25-సా.5.37 వరకు
✒ రాహుకాలం: ఉ.10.30-మ.12.00 వరకు
✒ యమగండం: మ.3.00-సా.4.30 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-ఉ.9.12.48 వరకు పునః మ.12.24-మ.1.12 వరకు ✒ వర్జ్యం: మ.2.46-సా.4.25 వరకు
✒ అమృత ఘడియలు: రా.12.33-రా.2.13 వరకు

News July 11, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* విద్యార్థులు బాగా చదువుకుని రాజకీయాల్లోకి రావాలి: CM CBN
* రైతులు మీకు దొంగలు, రౌడీలుగా కనిపిస్తున్నారా?: జగన్
* బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు తర్వాతే స్థానిక ఎన్నికలు: TG ప్రభుత్వం
* ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ బడులు: మంత్రి లోకేశ్
* 17వేలకు పైగా ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ సిద్ధం: మంత్రి పొన్నం
* HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావుకి 14 రోజుల రిమాండ్
* AP: కానిస్టేబుల్ ఫైనల్ స్కోర్ కార్డు విడుదల

News July 11, 2025

పేదల కోసం పెద్దలను ఆకర్షిద్దాం: చంద్రబాబు

image

AP: పీ4(పబ్లిక్-ప్రైవేట్-పీపుల్-పార్ట్నర్షిప్) అమలుకు ప్రభుత్వం కీలక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు మార్గదర్శకులుగా ఉండేందుకు పారిశ్రామికవేత్తలు, NIRలు వంటివారు 18,332మంది ముందుకొచ్చారు. వారిలో టాప్ 200మందిని ఈనెల 18న డిన్నర్‌లో సీఎం కలవనున్నారు. పీ4 లక్ష్యాలను వివరించి మరింత మందిని భాగస్వాములను చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని CM తెలిపారు. పేదల కోసం పెద్దలను ఆకర్షిద్దామని పేర్కొన్నారు.