News March 12, 2025
WGL: తరలివచ్చిన మొక్కజొన్న.. ధరల్లో స్వల్ప తేడా!

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి ఈరోజు మొక్కజొన్న తరలి వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. అయితే, ధర మాత్రం రైతులకు నిరాశ కలిగించింది. మక్కలు(బిల్టీ) ధరలు గత మూడు రోజుల నుంచి ఇలా ఉన్నాయి. సోమవారం క్వింటాకు రూ.2,305 ధర పలకగా.. మంగళవారం రూ.2,310కి చేరింది. ఈరోజు మళ్లీ రూ.2,305కి పడిపోయింది. ఈరోజు సైతం మార్కెట్‌కి పసుపు రాలేదు.
Similar News
News March 22, 2026
BTG: గుబ్బల మంగమ్మ క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

బుట్టాయగూడెం మండలం కామవరం గ్రామ శివారు అటవీ ప్రాంతంలో వెలసిన గుబ్బల మంగమ్మ తల్లి క్షేత్రంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. సెలవు దినం కావడంతో భక్తులు ఈ క్షేత్రానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు, తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు.
News March 22, 2026
ప్రత్యేక ఫ్లైట్ డిమాండ్ చేసినట్లు వార్తలు.. కోహ్లీ రియాక్షన్ ఇదే!

ఐపీఎల్ కోసం RCB బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇప్పటికే బెంగళూరు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే లండన్‌లో ఉంటున్న కోహ్లీ.. ఈ సీజన్‌లో రెగ్యులర్‌గా ఇంటికి వెళ్లి రావడానికి ప్రత్యేక ఫ్లైట్ అరేంజ్ చేయాలని RCB మేనేజ్మెంట్‌ను డిమాండ్ చేశారని పలు రిపోర్ట్స్ వచ్చాయి. దీనిని కోహ్లీ కొట్టిపారేశారు. ఈ వార్త హాస్యాస్పదంగా ఉందని సూచించేలా ఆ రిలేటెడ్ పోస్ట్ ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసి లాఫింగ్ ఎమోజీ పెట్టారు.
News March 22, 2026
పార్వతీపురం: ‘ PGRS వివరాల కోసం 1100కి ఫోన్ చేయండి’

పార్వతీపురం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోమవారం PGRS కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి కార్యాలయంలో ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించాలన్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్‌లో ప్రతిరోజూ వినతులు స్వీకరిస్తామన్నారు. అర్జీదారులు మీకోసం వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, వివరాలను 1100 నంబర్‌కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు అన్నారు.


