News March 12, 2025
గద్వాల కోట.. ఈ విషయం మీకు తెలుసా.?

తెలంగాణలోని అతిపెద్ద సంస్థానం జోగులాంబ గద్వాల కోట. తూర్పున అలంపూర్, పడమర రాయచూరు హద్దులుగా 360 గ్రామాలు కలిగి ఉన్నది. కర్నూల్ నవాబుల నుంచి కప్పం పొందిన సంస్థానంగా ఖ్యాతిగాంచింది. గద్వాల సంస్థానం మూల పురుషుడు బుడ్డారెడ్డి. గద్వాల సంస్థానాన్ని పాలించిన రాజులలో పెద్ద సోమభూపాలుడిని జానపద కథకులు ముద్దుగా నల్ల సోమనాద్రిగా పిలుచుకునే వారు. ఇతడే గద్వాల కోట నిర్మాణ కర్తగా పేరు పోందారు.
Similar News
News January 18, 2026
ప.గో. జిల్లాల్లో తగ్గని సంక్రాంతి సందడి!

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో శనివారం కోలాహలం నెలకొంది. మూడు రోజుల పాటు కోడిపందేలు, జూద క్రీడల్లో మునిగితేలిన జనం, ఇప్పుడు కుటుంబాలతో కలిసి విహారయాత్రలు, సినిమాలకు క్యూ కట్టారు. ఏలూరు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ భక్తులు, సందర్శకులతో కిటకిటలాడింది. పల్లెల నుంచి పట్నాల బాట పట్టడంతో ప్రధాన రహదారులు అర్ధరాత్రి వరకు రద్దీగా కనిపించాయి. సంక్రాంతి ముగిసినా సంబరాలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి.
News January 18, 2026
ఖమ్మం: పీడీఎస్యూ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి

ఈనెల 23, 24, 25న ఖమ్మంలో జరిగే PDSU రాష్ట్ర 23వ మహాసభల విజయవంతానికై రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులు భారీగా తరలిరావాలని రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ విజ్ఞప్తి చేశారు. శనివారం ఖమ్మం రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు విద్యారంగాన్ని ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాలకు అప్పగించి విద్యావ్యవస్థను పూర్తిగా వ్యాపారమయం చేశారని విమర్శించారు.
News January 18, 2026
విశాఖలో ప్రముఖ వైద్యుడి మృతి

వేలాది పోలియో, వికలాంగ బాధితులకు జీవితాల్లో వెలుగులు నింపిన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆదినారాయణరావు(85) శనివారం విశాఖపట్నంలో కన్నుమూశారు. ప్రేమ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడిగా 4 దశాబ్దాలకు పైగా సేవలందించిన ఆయన సుమారు 3లక్షల శస్త్ర చికిత్సలు చేశారు. పోలియో బాధితులకు చేసిన సేవలకుగాను 2022లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఆయన మృతికి వైద్య, ప్రజావర్గాలు సంతాపం వ్యక్తం చేశాయి.


