News March 12, 2025

తల్లి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి సీఎంగా పనిచేశారు: CBN

image

AP: TDPతోనే మహిళా సాధికారత ప్రారంభమైందని అసెంబ్లీలో CM CBN అన్నారు. ‘ఎన్టీఆర్‌ మహిళలకు తొలిసారిగా ఆస్తి హక్కు కల్పించారు. కానీ తల్లి, చెల్లికి వాటా ఇవ్వని వ్యక్తి గతంలో CMగా(జగన్‌ను ఉద్దేశించి) ఉన్నారు. ఇచ్చిన ఆస్తిని కూడా వెనక్కి తీసుకునేందుకు కోర్టుకెళ్లారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తే వాటా ఇవ్వలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా మహిళలను దృష్టిలో పెట్టుకుంటోంది’ అని తెలిపారు.

Similar News

News March 23, 2026

ఎక్స్పైరీ పేరిట రూ.40 కోట్ల మందులు మాయం!

image

TG: పేద రోగులకోసం వినియోగించాల్సిన ₹40 కోట్ల విలువైన మెడిసిన్స్ పక్కదారి పట్టినట్లు సమాచారం. హాస్పిటల్స్‌కు పంపిణీ చేసే ప్రధాన కేంద్రం నుంచి ఈ మందులను ఎక్స్పైరీగా చూపి బయటి షాపులకు తరలిస్తున్నట్లు విజిలెన్స్ విభాగం గుర్తించింది. క్యాన్సర్ వంటి రోగాలకు వాడే మందులూ ఇలా పక్కదారి పడుతున్నాయని కనుగొంది. విచారణలో స్టోర్ కీపర్ల వాంగ్మూలాలు నమోదు చేసింది. దీనిపై నివేదిక(H&FW/VIG/40CR-MED) రెడీ చేసింది.

News March 23, 2026

IPL: ఆ రికార్డు SRHదే!

image

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ చేసిన 287/3 స్కోరు అత్యధికం. హెడ్, క్లాసెన్ వంటి పవర్‌ హిట్టర్ల విధ్వంసంతో 2025లోనూ SRH 286/6(RR) & 278/3(MI)తో తన సత్తా ఏంటో చూపించింది. అత్యధిక స్కోర్ల జాబితాలో టాప్-5లో నాలుగు SRH పేరిట ఉండటం విశేషం. అలాగే 2024లో DCపై KKR 272/7తో ఐదో పొజిషన్‌లో ఉంది. ఈ సీజన్‌లోనైనా SRH 300 రన్స్ కొడుతుందో చూడాలి.