News March 12, 2025

గద్వాల కోట.. ఈ విషయం మీకు తెలుసా.?

image

తెలంగాణలోని అతిపెద్ద సంస్థానం జోగులాంబ గద్వాల కోట. తూర్పున అలంపూర్, పడమర రాయచూరు హద్దులుగా 360 గ్రామాలు కలిగి ఉన్నది. కర్నూల్ నవాబుల నుంచి కప్పం పొందిన సంస్థానంగా ఖ్యాతిగాంచింది. గద్వాల సంస్థానం మూల పురుషుడు బుడ్డారెడ్డి. గద్వాల సంస్థానాన్ని పాలించిన రాజులలో పెద్ద సోమభూపాలుడిని జానపద కథకులు ముద్దుగా నల్ల సోమనాద్రిగా పిలుచుకునే వారు. ఇతడే గద్వాల కోట నిర్మాణ కర్తగా పేరు పోందారు.

Similar News

News September 15, 2025

ప్రారంభమైన మార్కెట్.. పత్తి ధర ఏంతంటే?

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్‌కు పత్తి స్వల్పంగానే తరలివచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే గతవారంతో పోలిస్తే నేడు పత్తి ధర తగ్గింది. గత వారం గరిష్ఠంగా క్వింటా రూ.7,555 ధర పలకగా.. నేడు(సోమవారం) రూ.7,400కి తగ్గింది. మార్కెట్లో క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి.

News September 15, 2025

NIRDPRలో 150 ఉద్యోగాలు

image

HYDలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్‌‌(NIRDPR)లో 150 ఎన్యూమరేటెర్ పోస్టులున్నాయి. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వీటిని భర్తీ చేయనున్నారు. 45 ఏళ్ల లోపు డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన, పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: <>http://career.nirdpr.in/<<>>

News September 15, 2025

నెతన్యాహుకు ట్రంప్ బిగ్ వార్నింగ్

image

ఖతర్‌పై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ పీఎం నెతన్యాహుకు US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిగ్ వార్నింగ్ ఇచ్చారు. ఖతర్ తమ మిత్రదేశమని, జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు. ఖతర్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో తమకు సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఇటీవల ఖతర్‌లోని దోహాలో దాక్కున్న హమాస్ కీలక నేతలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే.