News March 12, 2025

గద్వాల కోట.. ఈ విషయం మీకు తెలుసా.?

image

తెలంగాణలోని అతిపెద్ద సంస్థానం జోగులాంబ గద్వాల కోట. తూర్పున అలంపూర్, పడమర రాయచూరు హద్దులుగా 360 గ్రామాలు కలిగి ఉన్నది. కర్నూల్ నవాబుల నుంచి కప్పం పొందిన సంస్థానంగా ఖ్యాతిగాంచింది. గద్వాల సంస్థానం మూల పురుషుడు బుడ్డారెడ్డి. గద్వాల సంస్థానాన్ని పాలించిన రాజులలో పెద్ద సోమభూపాలుడిని జానపద కథకులు ముద్దుగా నల్ల సోమనాద్రిగా పిలుచుకునే వారు. ఇతడే గద్వాల కోట నిర్మాణ కర్తగా పేరు పోందారు.

Similar News

News October 26, 2025

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి: యూటీఎఫ్‌

image

పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి జ్ఞానమంజరి డిమాండ్‌ చేశారు. సంగారెడ్డిలోని కేకే భవన్‌లో ఆదివారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి తరగతికి ఉపాధ్యాయుడిని నియమించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు అశోక్, ప్రధాన కార్యదర్శి సాయిలు తదితరులు పాల్గొన్నారు.

News October 26, 2025

పార్వతీపురం: రేపు వర్షాల కారణంగా గ్రీవెన్స్ రద్దు

image

పార్వతీపురం జిల్లా కేంద్రంలో సోమవారం జరగబోయే ప్రజా సమస్యలు పరిష్కార వేదిక (గ్రీవెన్స్) రద్దు చేసినట్లు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదివారం తెలిపారు. సోమవారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురువనున్న నేపథ్యంలో గ్రీవెన్స్ రద్దు చేశామని, ప్రజలు గమనించి సమస్యలు తెలపడం కోసం పార్వతీపురం రావద్దని పేర్కున్నారు.

News October 26, 2025

తుఫాను ఎఫెక్ట్.. TGలోనూ భారీ వర్షాలు

image

TGలోనూ ‘మొంథా’ ఎఫెక్ట్ ఉండొచ్చని HYD వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఈనెల 28న భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. కొమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈనెల 29న ADB, కొమురంభీం, మంచిర్యాల, NRML, PDPL, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని పేర్కొంది.