News March 12, 2025
ఈనెల 19న తెలంగాణ బడ్జెట్

TG: ఈనెల 27 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. ఈనెల 19న ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. మరోవైపు ఎమ్మెల్యేలకు పని విభజన చేయాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. ఇరిగేషన్, వ్యవసాయం, రెవెన్యూ, పవర్, వైద్యంతో పాటు పలు అంశాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. సంబంధిత శాఖ మంత్రులతో కో ఆర్డినేట్ చేసుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు.
Similar News
News September 18, 2025
మోదీకి విషెస్ జెన్యూన్ కాదన్న యూట్యూబర్‌పై విమర్శలు

ప్రధాని మోదీకి బర్త్ డే విషెస్ చెబుతూ ప్రముఖులు చేసిన ట్వీట్లు జెన్యూన్ కాదని యూట్యూబర్ ధ్రువ్ రాథీ ఆరోపించారు. ప్రముఖులు విష్ చేసేలా ఆయన టీమ్ ముందే వారికి ‘టూల్ కిట్’ ఇచ్చిందన్నారు. దీంతో ధ్రువ్ రాథీపై మోదీ అభిమానులు ఫైరవుతున్నారు. ట్రంప్, మెలోనీ, పుతిన్ వంటి నేతలను కూడా ఆయన టీమ్ మ్యానేజ్ చేసిందా అని ప్రశ్నిస్తున్నారు. రాహుల్, కేజ్రీవాల్‌కు కూడా ‘టూల్ కిట్’ ఇచ్చారా అని కౌంటర్ ఇస్తున్నారు.
News September 18, 2025
అక్టోబర్ 18న పీఎం కిసాన్ నిధులు విడుదల?

పీఎం కిసాన్ 21వ విడత డబ్బులను కేంద్రం అక్టోబర్ 18న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 20న దీపావళి నేపథ్యంలో అంతకుముందే నిధులను జమ చేయాలని మోదీ సర్కార్ భావిస్తున్నట్లు జాతీయా మీడియా పేర్కొంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ స్కీమ్ కింద ఏడాదికి 3 విడతల్లో రూ.6వేలు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి.
News September 18, 2025
రాష్ట్రంలో 21 పోస్టులు

<