News March 12, 2025
RECORD: కోహ్లీని దాటేసిన హార్దిక్ పాండ్య

భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీ రికార్డును దాటేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత కప్‌తో దిగిన ఫొటోను పాండ్య పోస్ట్ చేయగా 6 నిమిషాల్లోనే మిలియన్ లైక్స్ సాధించింది. గతంలో కోహ్లీ పెట్టిన ఓ పోస్టుకు 7నిమిషాల్లో మిలియన్ లైకులు రాగా, తాజాగా హార్దిక్ ఫొటో దాన్ని దాటేసింది. CT గెలిచిన తర్వాత కప్‌ను పిచ్‌పై ఉంచి కాబీలేమ్ స్టైల్లో దిగిన ఫొటో వైరల్ అయిన విషయం తెలిసిందే.
Similar News
News March 12, 2025
NEP అమలు చేస్తే రిజర్వేషన్లు ఉండవు: స్టాలిన్

NEP అమలుతో దేశమంతా హిందీ భాషను అభివృద్ధి చేయాలని బీజేపీ భావిస్తుందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శించారు. దీంతో స్థానిక భాషల గుర్తింపు తగ్గుతుందన్నారు. అంతేకాకుండా ఈ విద్యావిధానం అమలు చేస్తే రిజర్వేషన్లు ఉండవన్నారు. డీలిమిటేషన్‌తో ఉత్తర భారతంలో ఎంపీల సంఖ్య పెంచి అధికారాన్ని కాపాడుకోవాలని బీజేపీ భావిస్తుందన్నారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విఘాతమని DMK దీనిని అడ్డుకుంటుందని తెలిపారు.
News March 12, 2025
పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు

AP: రాష్ట్రంలో ఈ నెల 17 నుంచి 31 వరకు జరిగే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నారు. 3,450 సెంటర్లలో 6,19,275 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారు. 156 ఫ్లైయింగ్, 682 సిట్టింగ్ స్క్వాడ్స్ పర్యవేక్షిస్తారు. సెంటర్ల వద్ద 144 సెక్షన్ విధిస్తారు. జిరాక్స్, నెట్ సెంటర్లను మూసివేస్తారు. హాల్లోకి చీఫ్ సూపరింటెండెంట్ తప్ప ఎవరూ మొబైల్ తీసుకెళ్లకూడదు. కంట్రోల్ రూమ్ నం. 08662974540.
News March 12, 2025
నిలిచిన లావాదేవీలు.. స్పందించిన SBI

తమ బ్యాంక్ లావాదేవీలు ఫెయిల్ కావడంపై దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ SBI స్పందించింది. ‘SBI యూపీఐ లావాదేవీల్లో సాంకేతిక సమస్య ఎదురైంది. దీని కారణంగా కస్టమర్ల లావాదేవీలు ఫెయిల్ అవుతున్నాయి. దీన్ని సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఖాతాదారులు UPI లైట్ లావాదేవీలు వినియోగించుకోవచ్చు’ అని వెల్లడించింది. అటు తమ లావాదేవీలూ ఫెయిల్ అయ్యాయని, డబ్బులు కట్ అయ్యి ప్రాసెసింగ్‌లో పడ్డాయని యూజర్లు పోస్టులు పెడుతున్నారు.