News March 12, 2025
వికారాబాద్ జిల్లాలో నత్తనడకన సీసీ రోడ్ల పనులు

జిల్లాలో ఉపాధి హామీ పనులు సకాలంలో పూర్తి అయ్యే అవకాశాలు కనబడటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. జిల్లాకు మొత్తం 811 పనులకు గాను రూ.51.28 కోట్లు మంజూరయ్యాయి. ఈనెలాఖరు వరకు పనులు ప్రారంభించి పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో 75-80% పనులను ప్రారంభించారు. ఇందులో 432 పనులను పూర్తి చేశారు. జిల్లాలో ఇంకా 50% పనులు పూర్తి చేయాల్సి ఉంది.
Similar News
News March 18, 2026
MBNR : ఉడిత్యాలలో 36.8 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు

మహబూబ్‌నగర్ జిల్లాలో మంగళవారం రాత్రి వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. బాలానగర్ మండలం ఉడిత్యాలలో అత్యధికంగా 36.8 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. బాలానగర్ 30.8, నవాబుపేట మండలం కొల్లూరు 26.3, మిడ్జిల్ 21.5, నవాబుపేట 15.8, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 12.5, మహబూబ్ నగర్ అర్బన్ 11.7, జడ్చర్ల 10.3, మహమ్మదాబాద్ 9.3, గండేడ్ మండలం సల్కర్ పేట 5.5, దేవరకద్ర 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
News March 18, 2026
పోలవరం: వరుసగా ACBకి చిక్కుతున్న పోలీసులు

పోలవరం జిల్లాలో దాదాపు అన్ని పోలీస్ స్టేషన్లలో నిత్యం లోపాయకారి ఒప్పందాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెల వ్యవధిలో ముగ్గురు పోలీసులు ఏసీబీ అధికారులకు చిక్కడం గమనార్హం. ఫిబ్రవరి 12వ తేదీన ఓ కేసు విషయంలో నిందితుడి వద్ద 15వేలు లంచం తీసుకుంటూ గంగవరం SI వెంకటేశ్, కానిస్టేబుల్ వీరబాబు ACBకి దొరకగా, మంగళవారం రాజవొమ్మంగి ఎస్సై శివ కుమార్ కూడా నిందితుల వద్ద 15వేలు తీసుకుంటూనే దొరికారు.
News March 18, 2026
లింగాల మండలంలో 37.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

నాగర్ కర్నూల్ జిల్లాలో రోజురోజుకి ఎండలు విపరీతంగా దంచి కొడుతున్నాయి. గడిచిన 24 గంటలో అత్యధికంగా లింగాల, ఊర్కొండ మండలాలలో 37.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. తాడూరు మండలంలో 37.1°C, కల్వకుర్తి మండలంలో 36.9°C, తిమ్మాజిపేట మండలంలో 36.8°C, పెద్దకొత్తపల్లి మండలంలో 36.5°C, తెలకపల్లి మండలంలో 36.4, కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలలో 36.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


