News March 12, 2025
జోరుగా ‘హలాల్ మటన్’ వ్యతిరేక ఉద్యమం!

మహారాష్ట్రలో హలాల్ వ్యతిరేక ఉద్యమం ఊపందుకుంది. మంత్రి నితేశ్ రాణె స్వయంగా దీనికి నాయకత్వం వహిస్తుండటం, NDA నేతలు మద్దతిస్తుండటం గమనార్హం. హలాల్‌కు ప్రత్యామ్నాయంగా మల్హర్ సర్టిఫికేషన్‌ను తీసుకొచ్చారు. హిందూ పద్ధతుల్లో మేకలు, గొర్రెలు, కోళ్లను కోసే ఝట్కా పద్ధతిని ప్రమోట్ చేస్తున్నారు. సర్టిఫికేషన్ ద్వారా ఈ మాంసం షాపులను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తున్నారు. కాంగ్రెస్, MVA దీనిని వ్యతిరేకిస్తున్నాయి.
Similar News
News March 13, 2025
కళ తప్పిన గోవా టూరిజం.. కారణాలు ఇవే!

ఒకప్పుడు విదేశీ పర్యాటకులతో కళకళలాడిన గోవా ప్రస్తుతం వెలవెలబోతోంది. 2019లో 85 లక్షల మంది రాగా, 2023లో 15 లక్షల మంది మాత్రమే సందర్శించారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆగ్నేయాసియాలో మరింత తక్కువ ధరలకు పట్టణాలు అందుబాటులో ఉండడం, గోవాలో ఆటో, ట్యాక్సీ మాఫియా, ఇక్కడ జీవన వ్యయం పెరగడం వల్ల విదేశీ టూరిస్టులు తగ్గారని సమాచారం. దీనిని పెంచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది.
News March 13, 2025
BREAKING: పోసానికి బిగ్ షాక్

AP: నటుడు పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సీఐడీ నమోదు చేసిన కేసులో ఆయనకు గుంటూరు కోర్టు ఈ నెల 26 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోసానిని గుంటూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. నిన్నటివరకు నాలుగు కేసుల్లో బెయిల్ వచ్చిన పోసాని త్వరలోనే జైలు నుంచి బయటకు వస్తారని అంతా భావించగా, ఊహించని విధంగా మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చింది.
News March 13, 2025
ఒక్కో మ్యాచ్‌కు రూ.3,110 ఫీజు: ఆటగాళ్లకు PCB షాక్

ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించి తీవ్ర నష్టాల్లో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ టీ20 కప్‌లో పాల్గొనే దేశవాళీ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులను భారీగా కుదించింది. గతంలో ఒక్కో మ్యాచ్‌కు 40 వేల పాకిస్థానీ రూపాయలు (భారత కరెన్సీలో రూ.12 వేలు) ఇచ్చేది. ఇప్పుడు దానిని 10 వేలకు (భారత కరెన్సీలో రూ.3,110) తగ్గించింది. అలాగే చీప్ హోటళ్లలో బస, విమాన ప్రయాణాలపై కూడా ఆంక్షలు విధించింది.