News March 12, 2025
వరల్డ్ పారా అథ్లెటిక్స్‌లో కాంస్యంతో మెరిసిన లలిత

విజయనగరం ఉడా కాలనీకి చెందిన క్రీడాకారిణి కిల్లకి లలిత వరల్డ్ పారా అథెటిక్స్‌లో మెరిసింది. న్యూఢిల్లీ వేదికగా ప్రారంభమైన ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2025 పోటీల్లో తొలిరోజు టీ-11 విభాగం 1,500 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించింది. లలిత జిల్లాకు గర్వకారణమని పారా స్పోర్ట్స్ ప్రతినిధులు, తోటి క్రీడాకారులు అభినందించారు.
Similar News
News March 25, 2026
భార్య హత్య కేసులో భర్తకు జీవిత ఖైదు: VZM SP

పెదమానాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన భార్య హత్య కేసులో నిందితుడు వై.సత్యనారాయణకు జీవిత ఖైదు, రూ.3,000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి పద్మావతి తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ దామోదర్ బుధవారం తెలిపారు. భార్యపై అనుమానంతో పామ్ ఆయిల్ తోట వద్ద హత్య చేసినట్లు కేసు నమోదు కాగా.. పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. కోర్టులో అభియోగపత్రం దాఖలు చేయగా నేరం రుజువు కావడంతో శిక్ష పడిందన్నారు.
News March 25, 2026
VZM: ‘నిబంధనలపై పూర్తి స్థాయి అవగాహన ఏర్పరచుకోవాలి’

జనాభా లెక్కల కార్యక్రమంపై పూర్తి అవగాహనతో పని చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సూచించారు. బుధవారం విజయనగరం కలెక్టరేట్‌లో శిక్షకులకు శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమం 2 దశల్లో జరుగుతుందని, మొదటి దశలో గృహాల లెక్కింపు, రెండవ దశలో వచ్చే ఏడాది జనాభా గణన జరుగుతుందని తెలిపారు. గతంలో జనాభా లెక్కింపు మాన్యువల్ విధానంలో జరిగేదని, ఈసారి ఎలక్ట్రానిక్ విధానం ఉంటుందన్నారు.
News March 25, 2026
బొబ్బిలి: అదరగొట్టిన ధన్షిక.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు

బొబ్బిలి మండలం కొత్తపెంటకు చెందిన లక్షుంనాయుడు, హారిక దంపతుల కుమార్తె సిరికి ధన్షిక (22 నెలలు) అరుదైన ఘనత సాధించింది. అద్భుత జ్ఞాపకశక్తితో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇన్ఫ్‌ఫ్లుయెన్సర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఆల్ఫాబెట్స్, వారాలు, నెలలు, నేషనల్ సింబల్స్, శ్లోకాలు, అంకెలు, రైమ్స్ చెబుతూ ఆశ్చర్యపరుస్తోంది. ఈ చిన్నారి 5 నెలలకే నోబెల్ వరల్డ్ రికార్డ్ కూడా సాధించింది.


