News March 12, 2025
పోలీస్ సిబ్బంది కుటుంబాలకు అండగా ఉంటాం: ఎస్పీ

పోలీస్ సిబ్బంది కుటుంబాలకు అండగా ఉంటామని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ఎమ్.సంపూర్ణ రావు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు సంపూర్ణ రావు సతీమణి మార్తమ్మకు బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఫ్లాగ్ ఫండ్, విడో ఫండ్ చెక్‌లను జిల్లా ఎస్పీ అందజేశారు.
Similar News
News November 6, 2025
వివాహంలో కచ్చితంగా చేయాల్సిన 16 విధులు

1. వరాగమనం (వరుడి రాక), 2. స్నాతకం (వరుడి స్నానం),
3. మధుపర్క్ (మధుపర్క స్వీకరణ), 4. మంగళ స్నానం,
5. గౌరీ పూజ, 6. కన్యావరణం, 7. కన్యాదానము,
8. సుముహూర్తం (జీలకర్ర బెల్లం), 9. మంగళ సూత్ర ధారణ,
10. తలంబ్రాలు, 11. హోమం, 12. పాణిగ్రహణం,
13. సప్తపది (7 అడుగులు), 14. అరుంధతీ నక్షత్ర దర్శనం,
15. స్థాలీపాకం, 16. నాగవల్లి (చివరి పూజ).
☞ ఈ విధులు పూర్తవడంతో వివాహ మహోత్సవం సంపూర్ణమవుతుంది. <<-se>>#pendli<<>>
News November 6, 2025
వీల్‌ఛైర్ మోడల్

అవయవలోపంతో జన్మించిన అబోలీ జరిత్‌ను మొదట్లో బ్రతకడమే కష్టమన్నారు. వారి మాటల్ని వమ్ము చేస్తూ సోషల్‌మీడియా సెలబ్రిటీగా మారిందామె. నాగ్‌పూర్‌కు చెందిన అబోలీ చిన్నతనంలోనే అరుదైన ఎముకలసమస్య బారినపడింది. దీనికితోడు మూత్రపిండాల వైఫల్యం. దీనివల్ల నిత్యం డైపర్‌తో వీల్‌ఛైర్‌లో ఉండాల్సిందే. వీటన్నిటినీ దాటి సింగర్, యాక్టర్‌గా మారాలనుకుంటున్న ఆమె ప్రస్తుతం వీల్‌ఛైర్ మోడల్‌గా ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.
News November 6, 2025
SRSPకి తగ్గిన ఇన్‌ఫ్లో

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఇన్‌ఫ్లో తగ్గింది. ఈరోజు ఉదయం ఇన్‌ఫ్లో 21,954 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 21,954 క్యూసెక్కులుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. వీటిలో 12,500 క్యూసెక్కులు స్పిల్‌వే గేట్ల ద్వారా, 8,000 క్యూసెక్కులు ఎస్కేప్ ఛానల్ ద్వారా విడుదల చేస్తున్నారు. అటు సరస్వతి కాలువ, మిషన్ భగీరథకు నీటి విడుదల కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ 4 గేట్లను తెరచి ఉంచారు. మొత్తం నీటినిల్వ 80.5 TMCగా ఉంది.


