News March 12, 2025

కార్య‌క్ర‌మాల‌ను చిత్త‌శుద్ధితో నిర్వ‌హించాలి: కలెక్టర్

image

రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌డుతున్న స్వ‌ర్ణాంధ్ర – స్వ‌చ్ఛాంధ్ర కార్య‌క్ర‌మాల‌ను చిత్త‌శుద్ధితో నిర్వ‌హించాల‌ని క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌తి మూడో శ‌నివారం చేప‌డుతున్న‌ స్వ‌చ్ఛ‌తా హీ సేవా కార్య‌క్ర‌మాలపై చర్చించారు. నిర్వ‌హ‌ణపై బుధ‌వారం ఉద‌యం త‌న ఛాంబ‌ర్ నుంచి నిర్వ‌హించిన‌ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు.

Similar News

News March 10, 2026

మధురవాడ: మహిళా దినోత్సవం వేడుకలు.. పురుషులకు వంట పోటీలు

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో భాగంగా భీమిలి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో మంగళవారం వాంబేకాలనీలో వినూత్నంగా పురుషులకు వంటల పోటీలు నిర్వహించారు. 9వ రోజు కార్యక్రమంగా జరిగిన ఈ పోటీలలో స్థానిక పురుషులు ఉత్సాహంగా పాల్గొని వివిధ రకాల వంటకాలను తయారు చేశారు. కుటుంబ బాధ్యతల్లో పురుషుల భాగస్వామ్యం, మహిళల పట్ల గౌరవం పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు.

News March 10, 2026

కేజీహెచ్ వైద్యులకు ఆరోగ్య శాఖ నోటీసులు

image

‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజీహెచ్‌కు చెందిన ఇద్దరు వైద్యులకు ఆరోగ్య శాఖ నోటీసులు జారీ చేసింది. గైనిక్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డా.పి.ఉషాదేవి, అనస్థీషియా విభాగాధిపతి ప్రొఫెసర్ వాసుపల్లి రవికి 10 రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించింది. స్పందించకపోతే అందుబాటులో ఉన్న ఆధారాలతో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

News March 10, 2026

విశాఖలో యువకుడి అనుమానాస్పద మృతి

image

విశాఖలో ఓ యువకుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందినట్లు టూటౌన్ ఎస్‌ఐ మన్మథరావు మంగళవారం తెలిపారు. కొబ్బరి తోట ప్రాంతంలో నివాసం ఉంటున్న యువకుడు బర్రె శివ ఇంట్లోనే ఉరివేసుకున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతుని మెడపై గాయాలు ఉండడంతో హత్యా? ఆత్మహత్యా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.