News March 12, 2025

గవర్నర్‌తో అబద్దాలు చెప్పించారు: KTR

image

రాష్ట్రంలో సాగునీటి సంక్షోభం తీవ్రమవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 30% మించి రైతు రుణమాఫీ జరగలేదని రుణమాఫీ అయిపోయిందని గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారన్నారు. అసెంబ్లీలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేసిన బడ్జెట్ ప్రసంగంలో అన్ని అబద్ధాలే ఉన్నాయని కేటీఆర్ ఆరోపించారు.

Similar News

News September 14, 2025

JGTL: ‘శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు’

image

శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జగిత్యాల విద్యానగర్‌కు చెందిన రౌడీషీటర్‌ బండి తరాల శ్రీకాంత్ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ దాదాపు 20 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. దీంతో శ్రీకాంత్‌పై పీడి యాక్ట్ అమలు చేశారు. ఈ మేరకు టౌన్ సీఐ కరుణాకర్ శనివారం నిందితుడికి కరీంనగర్ జైల్లో పీడి ఉత్తర్వులను అందజేశారు.

News September 14, 2025

HYD: కొడుకును చంపి మూసీలో పడేశాడు

image

HYDలోని బండ్లగూడ PS పరిధిలో దారుణం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన కొడుకు అనాస్(3)ని తండ్రి మహమ్మద్ అక్బర్ దారుణంగా హత్య చేసి సంచిలో మూట కట్టి మూసీలో పడేశాడు. బాలుడు కనిపించడం లేదని ఏంతెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ప్రవర్తనపై అనుమానంతో విచారించగా.. తానే నేరం చేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని మూసీలో బాలుడి మృతదేహం కోసం గాలిస్తున్నారు.