News March 12, 2025

శ్రీకాకుళంలో ఇంటర్ పరీక్షలకు 427 మంది గైర్హాజరు

image

శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. బుధవారం ఇంటర్ పరీక్షలకు హాజరైన విద్యార్థుల వివరాలను RIO దుర్గారావు ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 19,093 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 18,666 మంది హాజరైనట్లు వెల్లడించారు. 427 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మాల్ ప్రాక్టీస్ ఒక దగ్గర జరిగిందని స్పష్టం చేశారు.

Similar News

News March 20, 2026

శ్రీకాకుళం జిల్లాలో యువకుడి హత్య.!

image

శ్రీకాకుళం పట్టణంలోని 80 ఫీట్ రోడ్‌లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న మోహన్ అనే వ్యక్తి గత రాత్రి హత్యకు గురయ్యారు. హత్య చేసిన వ్యక్తి స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. గతంలో మోహన్ తండ్రి ఇదే పార్టీ కార్యాలయంలో పనిచేసేవారు. అతని స్థానంలో మోహన్‌ను ఇటీవల నియమించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 20, 2026

ఎచ్చెర్ల: 5 నోటిఫికేషన్లు.. నియామకాలు నిల్.!

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఐదు సార్లు ఫ్యాకల్టీ నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేశారు. నియామకాలు మాత్రం చేపట్టలేదు. 2013లో 34, 2014లో 15, 2017లో 48, 2018లో 32, 2023లో 98 పోస్టులకు నోటిఫికేషన్లు వేశారు. కొన్నిసార్లు ఇంటర్వ్యూలు నిర్వహించారు. అయినా నియామకాల మాత్రం జరగలేదు. ప్రస్తుతం రెగ్యులర్ ఫ్యాకల్టీ సభ్యులు ఏడుగురు మాత్రమే విశ్వవిద్యాలయంలో ఉన్నారు.

News March 20, 2026

శ్రీకాకుళం జిల్లాలో భారీ సైబర్ మోసం..!

image

శ్రీకాకుళం పట్టణంలోని పీ. ఎన్ కాలనీకి చెందిన విశ్రాంత జిల్లా వైద్యారోగ్య శాఖధికారి కృష్ణమోహన్‌ డిజిటల్ అరెస్టుకు గురయ్యరు. తన వద్ద సైబర్ నేరగాళ్లు రూ.56 లక్షలు కాజేశారని గురువారం 2-టౌన్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. తనకు హ్యూమన్ ట్రాఫికింగ్‌తో సంబంధాలు ఉన్నాయని, కేసు నమోదు అయిందని, డిజిటల్ అరెస్ట్ చేసినట్లు బెదిరించి సొమ్ము కాజేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.