News March 12, 2025
గవర్నర్‌కు KTR క్షమాపణలు చెప్పాలి: మహేశ్ కుమార్

TG: గవర్నర్ ప్రసంగాన్ని అవమానపరిచేలా KTR <<15732904>>మాట్లాడారని <<>>పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అధికారం పోయినా, ఆయనలో అహంకారం తగ్గలేదని దుయ్యబట్టారు. KTR గవర్నర్‌కు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అటు ప్రతిపక్ష నేతగా KCR అసెంబ్లీకి రావడాన్ని మహేశ్ కుమార్ స్వాగతించారు. ప్రభుత్వానికి KCR సలహాలు ఇవ్వాలని సూచించారు.
Similar News
News March 13, 2025
SVSC ఐడియా ముందుగా ఆ హీరోకు చెప్పా: శ్రీకాంత్ అడ్డాల

వెంకటేశ్, మహేశ్ బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ బాక్సాఫీసు వద్ద హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఐడియాను ముందుగా నాగార్జునకు చెప్పినట్లు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెలిపారు. స్క్రిప్ట్ రెడీ చేయాల్సి ఉందని చెప్పడంతో చూద్దామన్నట్లు తెలిపారు. అదే సమయంలో సురేశ్ బాబు, వెంకటేశ్ కథ విని ఒకే చేసినట్లు వెల్లడించారు. ఆ తర్వాత వెంకీ, మహేశ్ కాంబినేషన్ కుదిరిందన్నారు.
News March 13, 2025
ఈ రోజు నమాజ్ వేళలు

మార్చి 13, గురువారం
ఫజర్: తెల్లవారుజామున 5.14 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.26 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.26 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.26 గంటలకు
ఇష: రాత్రి 7.38 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 13, 2025
TRAIN HIJACK: బందీలు విడుదల

పాకిస్థాన్ ట్రైన్ హైజాక్‌లో బందీలందరినీ సైన్యం విడిపించింది. 346 మందిని విడిపించినట్లు ప్రకటనలో పేర్కొంది. మొత్తం 33 మంది టెర్రరిస్టులను హతమార్చినట్లు తెలిపింది. ఈ క్రమంలో 28 మంది పాక్ జవాన్లు, బందీల్లో 21 మంది చనిపోయినట్లు వెల్లడించింది.