News March 12, 2025

Stock Markets: టెక్ షేర్లు విలవిల..

image

స్టాక్‌మార్కెట్లు ఫ్లాటుగా ముగిశాయి. నిఫ్టీ 22,470 (-27), సెన్సెక్స్ 74,029 (-72) వద్ద స్థిరపడ్డాయి. PVT బ్యాంకు, హెల్త్‌కేర్, ఫైనాన్స్, ఆటో, ఫార్మా, బ్యాంకు, చమురు, ఎనర్జీ షేర్లు ఎగిశాయి. ఐటీ, రియాల్టి, మీడియా, PSU బ్యాంకు, వినియోగ, మెటల్ షేర్లు ఎరుపెక్కాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటామోటార్స్, కొటక్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ టాప్ గెయినర్స్. ఇన్ఫీ, విప్రో, టెక్ఎం, నెస్లే, TCS టాప్ లూజర్స్.

Similar News

News March 27, 2026

చరణ్ బర్త్ డే.. మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్

image

రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘చిన్నప్పుడు నా చెయ్యి పట్టుకొని నడిచిన చరణ్ బాబు.. నేడు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచే స్థాయికి చేరాడు’ అంటూ కొనియాడారు. సినిమా, వ్యక్తిగత జీవితం, క్రమశిక్షణ, కుటుంబం పట్ల బాధ్యతను చరణ్ నిర్వర్తించే తీరు చూస్తే గర్వంగా ఉందని కొనియాడారు. దైవబలం, అభిమానుల ప్రేమతో చరణ్ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

News March 27, 2026

30 నుంచి ‘సదరం’ వైద్య శిబిరాలు

image

AP: సదరం సర్టిఫికెట్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 57,452 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరి వైకల్య ధ్రువీకరణకు 110 ఆస్పత్రుల్లో ఈ నెల 30 నుంచి మే నెలాఖరు వరకు 80 వేల వైద్య శిబిరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. వైకల్య శాతంపై అప్పీల్ చేసుకున్నవాళ్లు తొలుత పొందిన ఐడీని సంబంధిత ఆస్పత్రుల్లో తొలగించుకోవాలని సూచించారు. ఆ తర్వాత మళ్లీ అప్లై చేసుకోవాలన్నారు.

News March 27, 2026

భారీగా తగ్గిన వెండి ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ వెండి ధరలు భారీగా పడిపోయాయి. కేజీ సిల్వర్ రేటు రూ.15వేలు తగ్గి రూ.2,45,000 పలుకుతోంది. అటు బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.160 పెరిగి రూ.1,44,710కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.150 పెరిగి రూ.1,32,650 పలుకుతోంది.