News March 23, 2024
సంజామల మండల వాసికి కడప TDP MLA టికెట్

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కడప MLA అభ్యర్థిగా రెడ్డప్పగారి మాధవి రెడ్డిని అధినేత చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. YCP సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాతో ఆమె ఆమె తలపడనున్నారు. ఈమె ప్రస్తుతం కడపలో నివశిస్తున్నా.. సొంత ఊరు నంద్యాల జిల్లా సంజామల మండలం నొస్సం గ్రామం అని తెలిపారు. ఈమె భర్త కడప టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి.
Similar News
News March 5, 2026
ఎంపీ నిధుల వినియోగంపై బస్తిపాటి సమీక్ష

ఎంపీ నిధుల వినియోగం, అభివృద్ధి పనుల పురోగతిపై ఎంపీ బస్తిపాటి నాగరాజు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎంపీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఏపీఈడబ్ల్యూఐడీసీ శాఖల అధికారులు పాల్గొన్నారు. 2024-26 ఆర్థిక సంవత్సరాల పనులపై చర్చించిన ఎంపీ, నిధుల ఖర్చులో అలసత్వం వహించవద్దని ఆదేశించారు. పనులు వేగవంతం చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు.
News March 4, 2026
కర్నూలు: కూతురిని మోసం చేసిన తల్లికి రిమాండ్

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి నర్సింగ్ కాలేజీ హెడ్ కుక్ డి.రమణమ్మను చెక్ బౌన్స్, చీటింగ్ కేసులో త్రీటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. తన సొంత కూతురు ప్రదీపకు రూ.8 లక్షలు ఇవ్వాల్సి ఉండగా రమణమ్మ చెల్లని చెక్కులు ఇచ్చి మోసం చేసింది. దీనిపై బాధితురాలు కోర్టును ఆశ్రయించగా, న్యాయమూర్తి అనూష నిందితురాలికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ బుధవారం తీర్పునిచ్చారు.
News March 4, 2026
కర్నూలు: ఎండల ఎఫెక్ట్.. వడదెబ్బతో సర్పంచ్ భర్త మృతి

ఎండలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మంగళవారం కర్నూలులో 39 డిగ్రీలు, నంద్యాలలో 37 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. కాగా, నంద్యాల(D) జూపాడు బంగ్లా(M) తాటిపాడు సర్పంచ్ వంగల లక్ష్మీదేవి భర్త కృష్ణారెడ్డి(62) వడదెబ్బతో మృతిచెందారు.


