News March 12, 2025

మల్దకల్లో 37 9°c ఉష్ణోగ్రతలు నమోదు

image

గద్వాల జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నందున ఫ్యాన్లు, కూలర్లు వాడకం పెరిగింది. రేపటి నుంచి పగటిపూట ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళవారం మల్దకల్ మండల కేంద్రంలో అత్యధికంగా 37 9°c, గద్వాల్లో 37.3°c, అలంపూర్‌లో 37.1°c, సాతర్లలో 36.7°c ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News October 26, 2025

సిరిసిల్ల: నైపుణ్యాభివృద్ధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

మైనారిటీ యువతి యువకుల నుంచి నైపుణ్యాభివృద్ధి శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి భారతి తెలిపారు. ఈ మేరకు సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో శనివారం ఆమె ప్రకటన విడుదల చేశారు. ముస్లిం, బౌద్ధ, పార్శి, సిక్కు, జైనుల యువత యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నవంబర్ 6లోపు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News October 26, 2025

అక్టోబర్ 26: చరిత్రలో ఈరోజు

image

1890: పాత్రికేయుడు, జాతీయోద్యమ కార్యకర్త గణేశ్ శంకర్ విద్యార్థి జననం (ఫొటోలో ఎడమవైపు)
1955: హిందుస్థానీ సంగీత విద్వాంసుడు డి.వి.పలుస్కర్ మరణం
1965: సింగర్ నాగూర్ బాబు(మనో) జననం (ఫొటోలో కుడివైపు)
1974: నటి రవీనా టాండన్ జననం
1985: హీరోయిన్ ఆసిన్ జననం
2005: గృహ హింస చట్టం అమలులోకి వచ్చిన రోజు

News October 26, 2025

నల్గొండ: మద్యం దుకాణాలకు ఈ నెల 27న డ్రా

image

2025- 27కు సంబంధించి నల్గొండ జిల్లాలోని 154 మద్యం దుకాణాలకు 4,906 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి రమణ తెలిపారు. ఈనెల 27న ఉదయం 11 గంటలకు నల్గొండలోని హైదరాబాద్ రోడ్లో గల లక్ష్మి గార్డెన్స్‌లో కలెక్టర్ ఆధ్వర్యంలో మద్యం దుకాణాల ఎంపిక లాటరీ ద్వారా జరుగుతుందన్నారు. డ్రా ప్రారంభ సమయంలో మీడియాకు అనుమతి లేదని, డ్రా పూర్తిగా ముగిసిన తర్వాత మీడియాకు వివరాలు అందజేస్తామన్నారు.