News March 12, 2025
NRPT: వార్డు ఆఫీసర్‌ను అభినందించిన కమిషనర్

నారాయణపేట మున్సిపాల్టీలో వార్డు ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న వేణు నిన్న విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో 31వ ర్యాంకు సాధించి ఉద్యోగం సంపాదించాడు. దీంతో బుధవారం మున్సిపల్ కమిషనర్ బొగేశ్వర్లు వేణును శాలువాతో సన్మానించి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. మునుముందు మరిన్ని ఉన్నత పదవులు సంపాదించాలని కోరారు. మున్సిపల్ సిబ్బంది వేణుకు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News March 28, 2026
జాగృతిలో చేరికలు.. కండువా కప్పి ఆహ్వానించిన కవిత

తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు సంస్థలో చేరారు. నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ సంస్థ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
News March 28, 2026
హనుమకొండ: విషాదం. విద్యార్థిని మృతి

వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పత్తిపాక తండాకు చెందిన బి.స్నితిక (14) అనారోగ్యంతో శనివారం ఉదయం మృతి చెందింది. సాగర్ – వాణి దంపతులు తమ పిల్లల చదువుల కోసం హనుమకొండలో నివసిస్తున్నారు. వీరి కుమార్తె స్నితిక హంటర్ రోడ్డులోని ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను మెరుగైన చికిత్స కోసం HYDలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది.
News March 28, 2026
మిర్యాలగూడకు మళ్లీ ఎంపీ స్థానం దక్కేనా?

గతంలో పార్లమెంట్ నియోజకవర్గంగా ఉన్న మిర్యాలగూడకు మళ్లీ ఆ హోదా కల్పించాలని స్థానికుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. ఆసియాలోనే అతిపెద్ద రైస్ మిల్లింగ్ కేంద్రంగా, వాణిజ్యపరంగా ఎంతో ప్రాముఖ్యం కలిగిన ఈ ప్రాంతానికి రాబోయే డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) లో న్యాయం చేయాలని కోరుతున్నారు. మళ్లీ ఎంపీ స్థానం వస్తే పారిశ్రామికంగా, ఆర్థికంగా మరింత అభివృద్ధి జరుగుతుందని స్థానికులు బలంగా ఆకాంక్షిస్తున్నారు.


