News March 12, 2025
రన్యారావును నిద్రపోనివ్వడం లేదు: లాయర్లు

బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టైన నటి రన్యారావును డీఆర్ఐ అధికారులు నిద్రపోనివ్వడం లేదని ఆమె తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు. మర్డర్ కేసుల్లోనే మహిళలకు బెయిల్ లభిస్తోందని, అలాంటప్పుడు బెయిల్ పొందడానికి రన్యా కూడా అర్హురాలని వాదనలు వినిపించారు. కాగా రన్యారావు దుబాయ్ నుంచి నడుము చుట్టూ, కాళ్ల కింద భాగం, షూలో 14 కిలోల బంగారం అక్రమంగా తీసుకువస్తూ డీఆర్ఐ అధికారులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే.
Similar News
News March 13, 2025
ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు ఉత్తర్వులు

TG: ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 765.28 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ఈ అథారిటీ ఛైర్మన్‌గా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించనున్నారు. దీని పరిధిలో 56 రెవెన్యూ గ్రామాలు, 7 మండలాలు రానున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌కు ధీటుగా దీనిని ప్రభుత్వం ఫోర్త్ సిటీగా అభివర్ణిస్తోంది.
News March 13, 2025
నితీశ్ రాజీనామా చేసి ఆశ్రమానికి వెళ్లు: తేజస్వీ యాదవ్

బిహార్ సీఎం నితీశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ డిమాండ్ చేశారు. నితీశ్ రాష్ట్రాన్ని పాలించేందుకు ఫిట్‌గా లేరని దుయ్యబట్టారు. ఆయన ప్రవర్తన సరిగా లేదని, మహిళలను అవమానపరుస్తున్నారని తేజస్వీ ఆరోపించారు. నితీశ్ స్పృహ లేకుండా పాలన చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెంటనే పదవికి రాజీనామా చేసి ఆశ్రమానికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
News March 13, 2025
మార్చి 13: చరిత్రలో ఈ రోజు

* 1899: హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు జననం
* 1901: అమెరికా మాజీ అధ్యక్షుడు బెంజమిన్ హారిసన్ మరణం
* 1940: జలియన్ వాలాబాగ్ కారకుడు మైఖెల్ డయ్యర్‌ను ఉద్దమ్ సింగ్ లండన్‌లో హతమార్చాడు
* 1955: నేపాల్ రాజుగా పనిచేసిన త్రిభువన్ మరణం
* 1978: డైరెక్టర్ అనూషా రిజ్వీ జననం