News March 12, 2025
VZM: ‘సారా రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలి’

సారా రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో నాటుసారా నిర్మూలన సమన్వయ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. నాటు సారాకు సంబంధించిన ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబరు 14405 కు విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు.
Similar News
News January 16, 2026
రామభద్రపురంలో పండకొచ్చిన అల్లుడికి 101 వంటకాలతో విందు

రామభద్రపురం మండల కేంద్రం శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన నూతన జంట పూసర్ల వెంకట సాయికుమార్, పద్మావతి దంపతులను అత్తవారు మొదటి సంక్రాంతి పండగకు ఆహ్వానించారు. 101 రకాల వంటకాలను ఇవాళ తయారు చేసి పెద్ద అరటి ఆకులో కొత్త అల్లుడికి వడ్డించారు. ఇలా సంప్రదాయంగా వంటకాలు పెట్టిన బొడ్డు నాగ సైనకుమార్, సత్య దంపతులను పలువురు కొనియాడారు.
News January 16, 2026
గరివిడి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ

గరివిరి పోలీస్ స్టేషన్ ఎస్పీ ఏఆర్ దామోదర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పండగ నేపథ్యంలో గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్సై లోకేశ్వరరావు, సిబ్బందికి సూచించారు. శాంతి భద్రతల విషయంలో కఠిన చర్యలు చేపట్టాలని తెలిపారు. అనంతరం సిబ్బందికి స్వీట్స్ అందజేసి పండగ శుభాకాంక్షలు తెలిపారు.
News January 16, 2026
గుర్ల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ

గుర్ల పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించారు . పండగ సందర్భంగా ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు తగు సూచనలు సలహాలు ఇచ్చి క్షేమంగా గమ్యస్థానం చేరే విధంగా చూడాలని ఎస్సై నారాయణరావుకు సూచించారు. అనంతరం పోలీస్ సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు.


