News March 12, 2025
4 నెలల్లో ₹86లక్షల కోట్లు ఆవిరి.. గ్లోబల్ మార్కెట్లో తగ్గిన భారత వాటా

నిఫ్టీ, సెన్సెక్స్ క్రాష్‌తో గత 4 నెలల్లోనే రూ.86లక్షల కోట్ల ($1T) మార్కెట్ విలువ నష్టపోయిందని బ్లూమ్‌బర్గ్ రిపోర్టు పేర్కొంది. దీంతో ప్రపంచ మార్కెట్ విలువలో భారత వాటా తగ్గిపోయింది. 20 రోజుల సగటు లెక్కింపు ప్రకారం గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లో గత ఏడాది 4% ఉన్న ఈ విలువ ఇప్పుడు 3%కు పడిపోయింది. సాధారణంగా సంక్షోభం తర్వాత 70 రోజుల్లో రికవరీ బాట పట్టే సూచీలు అనిశ్చితితో వరుసగా 5 నెలలు నష్టాల్లో ముగిశాయి.
Similar News
News November 12, 2025
ప్రభుత్వ వైఫల్యం వల్లే పేలుడు: ఖర్గే

ప్రభుత్వ వైఫల్యం వల్లే ఢిల్లీ బ్లాస్ట్ జరిగిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ‘దేశ రాజధానిలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం. IB, CBI లాంటి ఏజెన్సీలు ఉన్నప్పటికీ ప్రభుత్వం విఫలమైంది. దర్యాప్తు నివేదిక వచ్చాక మేం మరింత మాట్లాడతాం’ అని తెలిపారు.
News November 12, 2025
5 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు

ఢిల్లీ పేలుడు ఘటన తర్వాత దేశంలోని 5 విమానాశ్రయాలకు తాజాగా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. HYD, ఢిల్లీ, ముంబై, చెన్నై, త్రివేండ్రం ఎయిర్‌పోర్టులు పేల్చేస్తామని దుండగుల నుంచి ఇండిగో ఎయిర్‌లైన్స్ కార్యాలయానికి మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్ HYD సహా మిగతా ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. బస్టాప్స్, టెంపుల్స్, షాపింగ్ మాల్స్‌లోనూ సోదాలు నిర్వహిస్తోంది.
News November 12, 2025
ఇతిహాసాలు క్విజ్ – 64 సమాధానాలు

ఈరోజు ప్రశ్న: కర్ణుడు బ్రాహ్మణుడు కాదు, క్షత్రియుడు అని పరశురాముడు ఎలా గుర్తించాడు?
జవాబు: ఓరోజు పరశురాముడు కర్ణుడి ఒడిలో తలపెట్టి నిద్రిస్తున్నాడు. ఆ సమయంలో ఓ పురుగు కర్ణుడి తొడను రక్తం వచ్చేలా కుట్టింది. గురువు నిద్రకు భంగం కలగకూడదని కర్ణుడు ఆ నొప్పిని భరించాడు. రక్తపు ధార తగిలి పరశురాముడు మేల్కొని, ఆ దారుణమైన బాధను సహించే శక్తి క్షత్రియుడికి తప్ప వేరొకరికి ఉండదని గుర్తించాడు. <<-se>>#Ithihasaluquiz<<>>


