News March 12, 2025

రాజనీతి శాస్త్రంలో నిర్మల్ వాసికి డాక్టరేట్

image

నిర్మల్‌ పట్టణానికి చెందిన రాజనీతి శాస్త్ర లెక్చరర్‌ కొండా గోవర్ధన్‌ ఇటీవల హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ పట్టా పొందారు. రాజనీతి శాస్త్రంలో పొలిటికల్‌ అవేర్నెస్‌ ఆఫ్‌ గ్రాస్‌ రూట్‌ లెవెల్‌ లీడర్‌‌షిప్‌ ఇన్‌ ఆదిలాబాద్‌ డిస్ట్రిక్ట్‌ అనే అంశంపై పరిశోధన చేశారు. ఈ మేరకు బుధవారం ఆయనను పలువురు మిత్రులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో స్వామి, సాగర్‌రెడ్డి, మహేశ్, అశోక్ ఉన్నారు.

Similar News

News September 15, 2025

పారిశుద్ధ్య కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించండి: KMR కలెక్టర్

image

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని KMR కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాల వల్ల నీరు నిలిచి దోమలు వృద్ధి చెందే అవకాశం ఉన్నందున అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షించాలని జిల్లా పంచాయతీ అధికారి మురళీ, మున్సిపల్ కమిషనర్లకు సూచించారు.

News September 15, 2025

శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా పోలీసుల వాహన తనిఖీలు

image

శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాలతో సోమవారం సాయంత్రం పోలీసులు జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలు నిర్వహించి ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టారు. ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించగా హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి అని అవగాహన కల్పిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్‌లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.

News September 15, 2025

BREAKING: కాలేజీలతో చర్చలు సఫలం

image

TG: కాలేజీల యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో రేపటి నుంచి కాలేజీలు యథావిధిగా నడవనున్నాయి. ప్రస్తుతం రూ.600కోట్ల బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీపావళికి మరో రూ.600కోట్లు రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు బంద్‌ను విరమించుకున్నాయి.