News March 12, 2025
నిర్మల్: ‘దివ్యాంగుల జీవితాలను మెరుగుపరిచేందుకు కృషి’

ప్రభుత్వం నూతన పథకాలను ప్రవేశపెట్టి దివ్యాంగుల జీవితాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో సమగ్ర శిక్ష, విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ చేశామన్నారు.
Similar News
News November 12, 2025
18 నుంచి కేయూ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు

కాకతీయ యూనివర్సిటీ (కేయూ) పరిధిలో బీఏ, బీకాం, బీఎస్సీ సహా ఇతర డిగ్రీ కోర్సుల 1, 3, 5వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 18 నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ తెలిపారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. వివరాలు కేయూ వెబ్‌సైట్‌లో ఉన్నాయన్నారు.
News November 12, 2025
ఆఫీసుకు 5 రోజులు రావాలన్న CEO.. 600 మంది రిజైన్

వారానికి 5 రోజులు ఆఫీసుకు రావాలన్న CEOకి ఉద్యోగులు షాకిచ్చారు. పారామౌంట్, స్కైడాన్స్ మీడియా విలీనం తర్వాత CEO డేవిడ్ ఎల్లిసన్ WFH చేస్తున్న వారందరూ వారానికి 5 రోజులు ఆఫీసుకు రావాలని ఆదేశించారు. లేదంటే బైఅవుట్(స్వచ్ఛందంగా వైదొలగడం) ఆఫర్ తీసుకోవాలని సూచించారు. దీంతో వైస్ ప్రెసిడెంట్ కంటే కింది స్థాయిలో పనిచేస్తున్న 600 మంది ఉద్యోగులు ఎల్లిసన్ ఆఫర్‌ను స్వీకరించి రిజైన్ చేశారు.
News November 12, 2025
NIT సమీపంలో ఛాతి నొప్పితో వ్యక్తి మృతి

NIT సమీపంలో ఛాతి నొప్పితో ఓ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి విజయవాడకు వెళుతున్న ఓ ప్యాసింజర్‌కు ఛాతిలో నొప్పి రావడంతో తన కుమారుడికి ఫోన్ చేశారు. వెంటనే నెక్స్ట్ స్టేజీ వద్ద దిగి ఆసుపత్రికి వెళ్లమని కుమారుడు సలహా ఇవ్వడంతో కాజీపేటలో ట్రైన్ దిగి ఆటోలో ఆసుపత్రికి వెళుతుండగా ఎన్ఐటీ సమీపంలో నొప్పి ఎక్కువై మరణించాడని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.


