News March 12, 2025
వనపర్తి: ఇంటర్ పరీక్షలకు 150 మంది విద్యార్థులు గైర్హాజరు

వనపర్తి జిల్లాలో బుధవారం నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం బోటనీ, మాథ్స్, పొలిటికల్ సైన్స్ పరీక్షలకు 5,837 మంది విద్యార్థులు హాజరు కాగా, 150 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు ఇంటర్ విద్యాధికారి ఎర్ర అంజయ్య తెలిపారు. బుధవారం పెద్దమందడి మండల కేంద్రంలోని ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా పరీక్షలు జరిగినట్లు డీఐఈఓ పేర్కొన్నారు.
Similar News
News March 13, 2025
మెదక్‌లో మహిళలు మిస్..

మెదక్ పట్టణంలో ఇద్దరు మహిళలు తప్పిపోయారు. వీరిలో… పాపన్నపేట్ మండలం ఎంకేపల్లి చెందిన కందెం నర్సమ్మ (50) ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అలాగే మెదక్ పట్టణానికి చెందిన నీరుడి కిష్టమ్మ (68) అదృశ్యమైంది. ఆమె మతిస్థిమితం సరిగ్గా లేదని తెలిపారు. ఇరువురు కుటుంబ సభ్యులు మెదక్ టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పైన తప్పిపోయిన వారి ఆచూకీ లభిస్తే మెదక్ టౌన్ పీఎస్‌లో తెలపాలని ఇన్స్పెక్టర్ నాగరాజు సూచించారు.
News March 13, 2025
సిద్దిపేట: ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

2025-26 విద్యాసంవత్సరానికి గాను సిద్దిపేట జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు మిగిలిన ఖాళీ సీట్లు భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈనెల 20 లోపు ఆన్‌లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. నియమ నిబంధనలకు లోబడి రిజర్వేషన్ల పద్ధతిలో విద్యార్థుల ఎంపిక ఉంటుందన్నారు.
News March 13, 2025
నేటి నుంచి 5 రోజులు జాగ్రత్త

TG: రాష్ట్రంలో నేటి నుంచి 18 వరకు వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, ములుగు, పెద్దపల్లి, హన్మకొండ, మహబూబాబాద్, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, వనపర్తి, గద్వాల్, నారాయణ్ పేట్ జిల్లాల్లో 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది.