News March 12, 2025
పెద్దపల్లి: మీకోసం TGNPDCL మొబైల్ ఫోన్ యాప్: ఎస్ఈ

విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి TGNPDCL మొబైల్ ఫోన్ యాప్‌ను రూపొందించిందని పెద్దపల్లి సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ మాధవరావు పేర్కొన్నారు. వినియోగదారుల సౌకర్యార్థం 20 ఫీచర్లతో కూడిన TGNPDCL డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. యాప్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 18004250028, 1912ని సంప్రదించాలని సూచించారు.
Similar News
News March 13, 2025
భీమ్‌గల్: రక్తం వచ్చేలా కొట్టిన ఉపాధ్యాయుడు

బాలుడిని ఉపాధ్యాయుడు కొట్టి గాయపరిచిన ఘటన భీమ్‌గల్ మండలం పల్లికొండ ప్రభుత్వ పాఠశాలలో బుధవారం చోటు చేసుకుంది. తల్లిదండ్రుల ప్రకారం.. గ్రామానికి చెందిన రిషి తరగతి గదిలో అల్లరి చేశాడని ఉపాధ్యాయుడు తీవ్రంగా కొట్టాడు. దీంతో తలకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయన్నారు. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించామన్నారు. టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని NSUI జిల్లా వైస్ ప్రెసిడెంట్ రెహమాన్ డిమాండ్ చేశారు.
News March 13, 2025
నాని సవాల్.. డైరెక్టర్ రియాక్షన్ ఇదే

తాను నిర్మాతగా తెరకెక్కించిన ‘కోర్టు’ సినిమా నచ్చకపోతే ‘హిట్-3’ చూడొద్దని హీరో నాని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ‘కోర్టు’ మూవీని సినీ ప్రముఖులు, మీడియాకు ప్రీమియర్ షో ప్రదర్శించారు. మూవీ చూసిన దర్శకుడు శైలేష్ కొలను తన సినిమా(హిట్-3) సేఫ్ అని ట్వీట్ చేశారు. కోర్టు మూవీ అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.
News March 13, 2025
మహబూబాబాద్: ఆవు ఢీకొని వ్యక్తి మృతి

మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సాలార్ తండా వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ నుంచి బైక్‌పై వెళ్తున్న సంపత్ అనే వ్యక్తిని రోడ్డుపై ఆవు ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కురవి మండలం సుధనపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు.