News March 12, 2025

సంగారెడ్డి: పాఠశాలలో మొక్కలు నాటిన కలెక్టర్

image

జిల్లా కేంద్రంలోని పోతిరెడ్డి పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ వల్లూరి బుధవారం సందర్శించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెలలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు అందరూ వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈవో వెంకటేశ్వర్లు, ఎంఈవో విద్యాసాగర్ పాల్గొన్నారు.

Similar News

News April 16, 2026

MDK: డిప్లొమా కోర్సుల్లో అనాథ బాలికలకు 70% సీట్లు: కలెక్టర్

image

HYDలోని ప్రభుత్వ మహిళా సాంకేతిక విద్యా సంస్థలో అనాథ, నిరుపేద బాలికలకు డిప్లొమా కోర్సుల్లో 70 శాతం సీట్లు కేటాయించినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. సివిల్, CSE, ECE, EEE విభాగాల్లో మూడేళ్ల డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు పాలిసెట్ (POLYCET) ద్వారా ప్రవేశం పొందవచ్చని, ఆసక్తి గల వారు మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించాలని కలెక్టర్ సూచించారు.

News April 16, 2026

2,078 మంది ఫెయిల్

image

ఇంటర్ ఫలితాలలో జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు 4,720 మంది పరీక్షలు రాయగా 2,078 మంది ఉత్తీర్ణత సాధించలేకపోయారని ఆర్ఐవో లాలప్ప తెలిపారు. జీజేసీ గర్ల్స్ 513 మందికి గాను 253, ఆదోని బాలికల కళాశాల 299 గాను 150, కోడుమూరు 125 మంది గాను 39, మంత్రాలయం 159 గాను 137, టౌన్ కళాశాల 609 మంది గాను 314, కోసిగి 111, నాగలదిన్నె 74, జీజేసీ బి.క్యాంప్ 128, ఆలూరు 148 మంది ఫెయిలయ్యారు.

News April 16, 2026

కర్నూలులో ఈనెల 17న ఉద్యోగ మేళా

image

జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 17న ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. PhonePe, టాటా ఎలక్ట్రానిక్స్, శ్రీరామ్ చిట్స్, భారత్ ఫైనాన్సియల ఇంక్లూషన్ Ltd సంస్థలు పాల్గొని 190 ఖాళీలను భర్తీ చేయనున్నాయి. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హత కలిగిన 18-30 ఏళ్ల వయసు గల అభ్యర్థులు హాజరుకావచ్చని జిల్లా ఉపాధి అధికారి దీప్తి తెలిపారు. అవసరమైన సర్టిఫికెట్లు, ఫొటోలు వెంట తీసుకురావాలని సూచించారు.