News March 12, 2025
రంప: పోలీసు స్టేషన్‌లకు చేరిన క్వశ్చన్ పేపర్స్

అల్లూరి జిల్లాలో పదో తరగతి పరీక్ష పత్రాలను పరీక్ష కేంద్రాలు సమీపంలో ఉన్న పోలీస్టేషన్‌లలో భద్రపరిచామని ఏజెన్సీ DEO.మల్లేశ్వరావు తెలిపారు. జిల్లాలో మొత్తం 71 కేంద్రాలకు 11,766 మంది విద్యార్థులకు సరిపడే సెట్ నంబర్ 1ప్రశ్న పత్రాలు పూర్తి స్థాయిలో జిల్లాకు చేరాయని తెలిపారు. రంపచోడవరం, చింతూరు డివిజన్‌లలో 28పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా పాడేరు డివిజన్ లో 43కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
Similar News
News March 13, 2025
పెబ్బేరు: దరఖాస్తు గడువు పెంపు: నరేష్ కుమార్

పెబ్బేరు ఆదర్శ పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి 6 నుంచి 10వ తరగతి ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసేందుకు తుది గడువు ఈనెల 20 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ నరేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇక్కడ విద్యార్థులు ప్రవేశాలు పొందితే ఇంటర్ వరకు నాణ్యమైన విద్య ఉచితంగా లభిస్తుందన్నారు.
News March 13, 2025
VZM: కేంద్ర మంత్రితో ఎంపీ కలిశెట్టి భేటీ

ఢిల్లీలోని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రామభద్రపురం నుంచి రాయగడ వరకు నాలుగు లైన్ల రోడ్లుగా మార్చాలని, అలాగే నెల్లిమర్ల జంక్షన్ నుంచి రామతీర్థం మీదగా రణస్థలం రోడ్డును విస్తరించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సమస్యలపై గతంలోనే కేంద్రమంత్రికి విన్నవించామని మరోసారి గుర్తు చేయడం జరిగిందని ఎంపీ తెలిపారు.
News March 13, 2025
మెదక్‌లో మహిళలు మిస్..

మెదక్ పట్టణంలో ఇద్దరు మహిళలు తప్పిపోయారు. వీరిలో… పాపన్నపేట్ మండలం ఎంకేపల్లి చెందిన కందెం నర్సమ్మ (50) ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అలాగే మెదక్ పట్టణానికి చెందిన నీరుడి కిష్టమ్మ (68) అదృశ్యమైంది. ఆమె మతిస్థిమితం సరిగ్గా లేదని తెలిపారు. ఇరువురు కుటుంబ సభ్యులు మెదక్ టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పైన తప్పిపోయిన వారి ఆచూకీ లభిస్తే మెదక్ టౌన్ పీఎస్‌లో తెలపాలని ఇన్స్పెక్టర్ నాగరాజు సూచించారు.