News March 12, 2025
అల్లూరి: ఆటో- బైక్ ప్రమాదం.. ఒకరు మృతి

అల్లూరి జిల్లా హుకుంపేట మండలం మారేల వద్ద బుధవారం సాయంత్రం బైక్-ఆటో ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. పెదబయలు మండలం మొండికోటకు చెందిన పల్లిపోయిన నాగరాజు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు పాడేరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. అతివేగంగా బైక్ నడిపి ఆటోను ఢీకొట్టడం వలన ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
Similar News
News March 24, 2026
అల్లూరి: ‘వచ్చే నెల 3 నుంచి స్పెషల్ ఆఫీసర్స్ పాలన’

ఉమ్మడి అల్లూరి జిల్లాలో ఏప్రిల్ 3 నుంచి పంచాయతీలు స్పెషల్ ఆఫీసర్స్ పాలనలోకి వెళ్తాయని జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్ రావు మంగళవారం తెలిపారు. ప్రస్తుతం ఉన్న సర్పంచ్‌లు, వార్డ్ మెంబర్స్ పదవీకాలం ఏప్రిల్ 2తో ముగుస్తుందని వెల్లడించారు. అల్లూరి జిల్లాలో 244, పోలవరం జిల్లాలో 186 పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్స్‌ను త్వరలో నియమించడం జరుగుతుందన్నారు. మండల స్థాయి అధికారులను నియమించాలని ఆదేశాలు అందాయన్నారు.
News March 24, 2026
HYDలో ఇంధనం, LPG సిలిండర్ల కొరత లేదు: CP

TG: హైదరాబాద్‌లో ఇంధనం, LPG సిలిండర్ల కొరత లేదని సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పష్టం చేశారు. తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఆందోళనతో బంకులు, ఏజెన్సీల వద్ద క్యూ కట్టి రద్దీ పెంచవద్దని కోరారు. పరిస్థితిని పోలీసులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారని, వదంతులను నమ్మవద్దని ఆయన ‘X’ వేదికగా విజ్ఞప్తి చేశారు. అందరూ ప్రశాంతంగా ఉండి సహకరించాలని ఆయన సూచించారు.
News March 24, 2026
వనపర్తిలో ఎండల తీవ్రత!

వనపర్తి జిల్లాలో భానుడు భగభగలాడుతున్నాడు. గడిచిన 24 గంటల్లో వెలుగొండలో అత్యధికంగా 38.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వీపనగండ్ల, దగడలో 38.6 డిగ్రీలుగా రికార్డయ్యాయి. జిల్లాలోని 21 కేంద్రాల్లో ఉష్ణోగ్రతలు అమాంతం పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.


