News March 12, 2025
ఉద్యోగులకు ₹33కోట్ల షేర్లు గిఫ్ట్‌గా ఇస్తున్న ప్రమోటర్

ఉద్యోగులకు తన షేర్లలో కొన్ని గిఫ్ట్‌గా ఇచ్చేందుకు ప్రుడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రమోటర్ సంజయ్ షాకు సెబీ అనుమతి ఇచ్చింది. కంపెనీ ఆరంభించి 25ఏళ్లు కావడంతో కొన్నేళ్లుగా నిజాయతీగా సేవలందిస్తున్న 650 మందికి ₹33కోట్ల విలువైన 1,75,000 షేర్లను పంచాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇందుకు ఒక చిన్న నిబంధన అడ్డంకిగా మారడంతో సెబీని సంప్రదించారు. ప్రస్తుతం ఒక్కో షేరు ధర రూ.1900గా ఉంది. మీ కామెంట్.
Similar News
News March 13, 2025
ఓటీటీలో అదరగొడుతున్న కొత్త సినిమా

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం ‘తండేల్’ ఓటీటీలో అదరగొడుతోంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో దేశవ్యాప్తంగా నం.1గా ట్రెండ్ అవుతోందని నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ట్వీట్ చేసింది. బ్లాక్‌బస్టర్ సునామీ ప్రేక్షకులకు ఫేవరెట్‌గా మారిందని పేర్కొంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ మూవీ రూ.115 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
News March 13, 2025
త్రిభాష విధానానికి సుధామూర్తి మద్దతు

జాతీయ విద్యా విధానంలోని త్రీ లాంగ్వేజ్ పాలసీకి ఇన్ఫోసిస్ కోఫౌండర్ నారాయణ మూర్తి భార్య, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి మద్దతు తెలిపారు. దీంతో పిల్లలు చాలా నేర్చుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. తనకు ఏడెనిమిది భాషలు తెలుసని చెప్పారు. కాగా ఈ విధానాన్ని తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం కావాలనే తమపై మూడో భాషను రుద్దే ప్రయత్నం చేస్తోందని విమర్శిస్తోంది.
News March 13, 2025
రోజూ చికెన్ తింటున్నారా?

చికెన్ అంటే ఇష్టపడని నాన్ వెజ్ ప్రియులు ఉండరు. అయితే రోజూ చికెన్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ప్రతి రోజూ తింటే శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగి ఎముకలు, కీళ్ల సమస్యలు వస్తాయంటున్నారు. గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు చికెన్‌కు దూరంగా ఉండటమే మేలని సూచిస్తున్నారు.