News March 12, 2025
సిద్దిపేట: దివ్యాంగులు ధైర్యంగా ఉండాలి: డీఈఓ

దివ్యాంగులు నిరుత్సాహపడకుండా ధైర్యంగా మానసిక స్తైర్యంతో ఉండాలని సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్లంకి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేట టీటీసీ భవన్లో భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని 57 మంది దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాలు పంపిణీ చేశారు. డీఈవో మాట్లాడుతూ.. దివ్యాంగులు ఉపకరణాలు ఉపయోగించి మానసికంగా అభివృద్ధి చెందాలని సూచించారు.
Similar News
News March 13, 2025
రోజూ చికెన్ తింటున్నారా?

చికెన్ అంటే ఇష్టపడని నాన్ వెజ్ ప్రియులు ఉండరు. అయితే రోజూ చికెన్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ప్రతి రోజూ తింటే శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగి ఎముకలు, కీళ్ల సమస్యలు వస్తాయంటున్నారు. గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు చికెన్‌కు దూరంగా ఉండటమే మేలని సూచిస్తున్నారు.
News March 13, 2025
గ్రూప్-1లో సత్తాచాటిన పెగడపల్లి మండల వాసి

పెగడపల్లి మండలం బతికేపల్లికి చెందిన గాలిపెల్లి రాజమౌళి- అనూష కుమార్తె గాలిపెల్లి స్నేహ ఇటీవల వెలువడిన గ్రూప్-1 ఫలితాల్లో 517 మార్కులతో రాష్ట్రస్థాయి 485వ ర్యాంకు సాధించింది. ఇన్కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తూ గ్రూప్-1కు ప్రిపేరై మొదటి ప్రయత్నంలోనే ఈ ర్యాంక్ సాధించడం పట్ల ఆమెను పలువురు అభినందించారు. ఆమె తండ్రి స్వర్ణకార వృత్తి చేస్తుండగా తల్లి కుట్టు మిషన్ కుడుతుంది.
News March 13, 2025
పెబ్బేరు: దరఖాస్తు గడువు పెంపు: నరేష్ కుమార్

పెబ్బేరు ఆదర్శ పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి 6 నుంచి 10వ తరగతి ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసేందుకు తుది గడువు ఈనెల 20 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ నరేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇక్కడ విద్యార్థులు ప్రవేశాలు పొందితే ఇంటర్ వరకు నాణ్యమైన విద్య ఉచితంగా లభిస్తుందన్నారు.