News March 12, 2025
గార్ల: బైక్ యాక్సిడెంట్ మహిళకు తీవ్ర గాయాలు

గార్ల మండలంలోని పూమ్యా తండా శేరిపురం వెళ్లే రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు బుధవారం ఢీకొన్నాయి. ఒక ద్విచక్ర వాహనంపై మహిళా డ్రైవింగ్ చేస్తుండగా, మరొక వాహనం ఎదురుగా వచ్చి ఢీకొనడంతో మహిళకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. తోటి వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు.
Similar News
News January 1, 2026
APPLY NOW: పవన్ హాన్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

పవన్ హాన్స్ లిమిటెడ్‌లో 18 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి బీటెక్, బీఈ, డిప్లొమా, ఎంఎస్సీ, ఎంబీఏ, పీజీడీఎం, ఎంసీఏ ఉత్తీర్ణులు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.40,000-రూ.2,40,000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.pawanhans.co.in/
News January 1, 2026
NEW YEAR: హ్యాంగోవర్ తగ్గాలంటే..

న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం, మసాలా ఆహారం అతిగా తీసుకోవడం వల్ల మరుసటి రోజు తలనొప్పి, కడుపులో మంట, వికారం వంటి <<18724599>>సమస్యలు<<>> ఎదురవుతాయి. ఉపశమనం కోసం ఎక్కువగా నీరు తాగి డీహైడ్రేషన్‌ను తగ్గించుకోవాలి. కొబ్బరి నీళ్లు/ నిమ్మరసం తాగితే శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ అందుతాయి. అల్లం టీ వికారాన్ని, అరటిపండు నీరసాన్ని తగ్గిస్తుంది. తేలికపాటి ఆహారం తీసుకుని కాసేపు నిద్రపోతే హ్యాంగోవర్ తగ్గుతుంది. share it
News January 1, 2026
మహిళల సొమ్ము దారిమళ్లిస్తే జైలుకే: కలెక్టర్

పల్నాడు జిల్లాలో డ్వాక్రా,మెప్మా స్వయం సహాయక సంఘాల నిధుల గోల్‌మాల్‌పై కలెక్టర్ కృతికా శుక్లా సీరియస్ అయ్యారు. అవినీతిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్లు బుధవారం తెలిపారు. నిధులు దారిమళ్లించిన బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా, దుర్వినియోగమైన ప్రతి పైసా రికవరీ చేస్తామన్నారు. అక్రమాల వల్ల నష్టపోయిన మహిళా సంఘాలకు ప్రభుత్వం తరపున అండగా ఉండి, తిరిగి రుణాలు పొందేలా చర్యలు చేపడతామన్నారు.


