News March 12, 2025
ఎన్నికల ప్రక్రియను బలోపేతం చేసేందుకు చర్యలు: బాపట్ల కలెక్టర్

ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేయడానికి భారత ఎన్నికల సంఘం ప్రత్యేకంగా వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులను, సీనియర్ నాయకులను ఆహ్వానిస్తుందని బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ స్థాయిలో ఏవైనా పరిష్కరించని సమస్యల ఉంటే ఈ ఏడాది ఏప్రిల్ 30 వ తేదీ నాటికి అన్ని జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల నుంచి భారత ఎన్నికల సంఘం సూచనలను ఆహ్వానిస్తుందన్నారు.
Similar News
News September 13, 2025
ఘర్షణల తర్వాత తొలిసారి మణిపుర్‌లో అడుగుపెట్టిన మోదీ

ప్రధాని మోదీ మణిపుర్ చేరుకున్నారు. ఇంఫాల్ ఎయిర్‌పోర్టులో ఆయనకు గవర్నర్ అజయ్ భల్లా, సీఎస్ పునీత్ గోయల్ స్వాగతం పలికారు. రెండేళ్ల నుంచి మణిపుర్‌లో తీవ్ర అల్లర్లు చెలరేగుతున్న విషయం తెలిసిందే. దీనిపై కేంద్రాన్ని, ప్రధానిని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ విమర్శలు కూడా చేసింది. ఈక్రమంలో ఘర్షణల తర్వాత మోదీ తొలిసారి మణిపుర్‌లో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
News September 13, 2025
తలసరి ఆదాయంలో అట్టడుగున ములుగు జిల్లా..!

అడవుల జిల్లా ములుగు తలసరి ఆదాయంలో రాష్ట్రంలో అట్టడుగున ఉంది. 2023-24 నివేదిక ప్రకారం రూ.1,97,639తో 25వ స్థానంలో కొనసాగుతోంది. జిల్లా ప్రజలు 90% వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు లేకపోవడంతో నిరుద్యోగం పెరిగింది. ఉన్న ఒక్క బిల్ట్ ఫ్యాక్టరీ దశాబ్ధం క్రితం మూతపడింది. ఇప్పుడిప్పుడే పర్యాటక రంగం వృద్ధిలోకి వస్తోంది. పామాయిల్ ఫ్యాక్టరీకి ఇటీవల పునాదులు పడ్డాయి.
News September 13, 2025
కర్నూలు జిల్లా కలెక్టర్‌గా సిరి బాధ్యతల స్వీకరణ

కర్నూలు జిల్లా నూతన కలెక్టర్‌గా అట్టాడ సిరి ఇవాళ ఉదయం పదవీ బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ ఛాంబర్‌లో ఉదయం 10.40 గంటలకు మత పెద్దలు సర్వమత ప్రార్థనలు చేసి, ఆమెను ఆశీర్వదించారు. పలువురు జిల్లా అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా సమగ్ర అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేద్దామని అధికారులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతీ లబ్ధిదారుడికి చేరేలా కృషి చేద్దామన్నారు.