News March 12, 2025
శ్రీకాకుళం: ఏసీబీకి చిక్కిన బీసీ వెల్ఫేర్ సీనియర్ అసిస్టెంట్

శ్రీకాకుళం జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసుకు చెందిన Sr.అసిస్టెంట్ బుడుమూరు బాలరాజు లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీకి చిక్కారు. ఇంక్రిమెంట్ల, ఎంట్రీ, బిల్లుల ప్రాసెస్ చేసే విషయంలో అదే శాఖకు చెందిన వివిధ B.C హాస్టల్‌లో పనిచేస్తే అటెండర్, కుక్‌ల నుంచి రూ.25,000 లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
Similar News
News March 13, 2025
పాతపట్నం: వచ్చే నెలలో పెళ్లి.. అంతలోనే మృతి

పాతపట్నం నుంచి టెక్కలి వెళ్లే రహదారి మార్గంలోని ద్వారకాపురం గ్రామం వద్ద బుధవారం రాత్రి రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పాతపట్నం మండలం, లాబర గ్రామానికి చెందిన సనపల మధు(22) మృతి చెందాడు. మృతుడి బావ మండల శివకు గాయాలయ్యాయి. సారవకోట మండలం జమ్మి చక్రం గ్రామానికి చెందిన మరో వ్యక్తి పంతులు గోపి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడికి ఏప్రిల్ 16 న పెళ్లి నిశ్చయమైంది.
News March 13, 2025
శ్రీకాకుళం: నేడు ఈ మండలాలకు ఆరంజ్ అలర్ట్

శ్రీకాకుళం జిల్లాలో గురువారం కింది మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) హెచ్చరించింది. ప్రజలు వడగాలులకు గురవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఈ మేరకు తమ అధికారిక ‘X’ ఖాతా ద్వారా ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది.*పోలాకి 37.6*నరసన్నపేట 37.8 *జి.సిగడం 40.6*ఎచ్చెర్ల 37.6* శ్రీకాకుళం 38*లావేరు 38.4 *పోలాకి 37.6*పొందూరు 39.6
News March 13, 2025
ఎచ్చెర్ల: డిగ్రీ మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోగల డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలను బుధవారం యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ పరీక్ష ఫలితాలను జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు. అలాగే రేపటి నుంచి రీవాల్యుయేషన్ కోసం నమోదు చేసుకోవచ్చని తెలిపారు.