News March 12, 2025
త్వరలో పరుగులు పెట్టనున్న హైడ్రోజన్ రైలు

దేశంలో త్వరలో హైడ్రోజన్‌తో నడిచే రైలు అందుబాటులోకి రానుంది. హరియాణా జింద్ నుంచి సోనిపట్ మార్గంలో నడిచే ఈ ట్రైన్‌ను ఈ నెల 31న ప్రారంభించే అవకాశాలున్నాయి. గంటకు 140కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే దీని వాటర్ సామర్థ్యం 40వేల లీటర్లు. ఒకసారి ఫుల్ చేస్తే 1000కిలోమీటర్లు ప్రయాణించగలదు. దేశవ్యాప్తంగా 35రైళ్లను అందుబాటులోకి తేవాలని రైల్వేశాఖ భావిస్తోంది. రీసెర్చ్, డిజైన్, స్టాండర్డ్ సంస్థ తయారు చేసింది.
Similar News
News March 13, 2025
ఉచిత గ్యాస్ సిలిండర్ తీసుకునేవారికి అలర్ట్

AP: ‘దీపం-2’ పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ ఇప్పటికీ తీసుకోనివారు ఈ నెలఖారులోగా మొదటిది బుక్ చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ సూచించారు. లేదంటే మూడు సిలిండర్లలో ఒకటి కోల్పోతారని చెప్పారు. ఏప్రిల్ నుంచి రెండో సిలిండర్ బుకింగ్‌లు ప్రారంభమవుతాయన్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 97 లక్షల మంది లబ్ధిదారులు ఉచిత గ్యాస్ బుక్ చేసుకున్నట్లు వెల్లడించారు.
News March 13, 2025
హోలి: కృత్రిమ రంగులు వాడుతున్నారా?

హోలి వేడుకల్లో కృత్రిమ రంగులను వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ రంగులు కళ్లలో పడితే కంటి వాపు, మసకబారిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. ఇక చర్మంపై పడితే పొడిబారడం, దురదలు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. ముక్కు, నోటి ద్వారా శరీరంలోకి వెళ్తే శ్వాస, జీర్ణ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. సహజ రంగులనే వాడాలని సూచిస్తున్నారు.
News March 13, 2025
జూన్ నాటికి అర్హులకు 5 లక్షల ఇళ్లు: మంత్రి

AP: రాష్ట్రంలో ఈ ఏడాది జూన్ నాటికి 5 లక్షల ఇళ్లు నిర్మించి అర్హులకు ఇస్తామని మంత్రి పార్థసారథి చెప్పారు. పేదల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులను గత వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా ఉపయోగించిందని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చాక 1.25 లక్షల నిర్మాణాలు పూర్తి చేశామని, మిగిలిన 7.25 లక్షల గృహ నిర్మాణాలను 2026 మార్చిలోగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.