News March 23, 2024
పోషణ్ అభియాన్ కార్యక్రమంలో కరీంనగర్ టాప్

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్‌లో భాగంగా నిర్వహించిన పోషణ పక్షోత్సవాలు శనివారం ముగిశాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంతో పాటు ప్రాజెక్టు, మండల, గ్రామ స్థాయిలో ఉత్సవాలను నిర్వహించారు. ఇందులో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.కార్యక్రమ వివరాలను సూచించే ఆన్‌లైన్ సైట్‌లో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది.
Similar News
News April 20, 2025
సిరిసిల్ల: వలకు చిక్కిన భారీ చేప

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లికి చెందిన జాలరు గోలాడ నరేశ్‌కు వలలో 32.5 కిలోల భారీ బొచ్చ చేప చిక్కింది. రోజు లాగానే సిరిసిల్లలోని మిడ్ మానేరులో చేపలు పట్టడానికి వెళ్లగా వలలో భారీ చేప చిక్కిందని నరేశ్ తెలిపాడు. ఇంతవరకు ఎప్పుడూ ఇంత పెద్ద చేప ఎప్పుడు చిక్కలేదని, మొదటిసారిగా ఇంత పెద్ద చేపను పట్టుకున్నామని నరేశ్ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ భారీ చేపను చూడడానికి స్థానికులు ఆసక్తి చూపారు.
News April 19, 2025
కరీంనగర్ జిల్లాలో భగ్గుమంటున్న ఎండలు

KNR జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నారు. గడచిన 24 గంటల్లో అత్యధికంగా జమ్మికుంట మండలంలో 42.7°C నమోదు కాగా, మానకొండూర్ 42.6, గన్నేరువరం 42.3, గంగాధర 42.1, రామడుగు 41.5, కరీంనగర్ 41.4, చిగురుమామిడి, చొప్పదండి 41.2, తిమ్మాపూర్ 41.1, సైదాపూర్ 40.9, శంకరపట్నం, కరీంనగర్ రూరల్ 40.7, వీణవంక 40.6, హుజూరాబాద్ 40.3, కొత్తపల్లి 39.9, ఇల్లందకుంట 39.9°C గా నమోదైంది.
News April 19, 2025
కరీంనగర్: ‘అత్తాన, పోతాన’.. ఇదే మన యాస, భాష

ప్రాంతాన్ని బట్టి భాష మాట్లాడే తీరు ఉంటుంది. WGL, KNR జిల్లాల్లో మాత్రం భాష కాస్త భిన్నంగా ఉంటుంది. KNR వారు అకారంతో మాట్లాడితే WGLలో ఒకారంతో మాట్లాడతారు. KNRలో వడ్లు అంటే WGLలో ఒడ్లు అంటాం. వేరే జిల్లాల్లో వస్తున్నా, వెళ్తున్నా అంటే మనం మాత్రం ‘అత్తాన, పోతాన’ అంటుంటాం. అచ్చిన, అట్లనా, అవ్వ, నాయిన, అప్పయ్య, జర ఆగు, షానా(చాలా), పైలం, బువ్వ అనే పదాలు వాడుతుంటాం. మీరెలా మాట్లాడుతారో కామెంట్ చేయండి.