News March 12, 2025

అనకాపల్లి: రాష్ట్ర పండుగగా నూకాంబిక అమ్మవారి జాతర

image

అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతరకు రాష్ట్ర పండగగా గుర్తింపు లభించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి వినయ్ చంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 28 కొత్త అమావాస్య నుంచి వచ్చేనెల 27వ తేదీ వరకు అమ్మవారి జాతర జరుగుతుంది. ఇటీవల నూకాంబిక జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలని సీఎం చంద్రబాబుకు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.

Similar News

News March 17, 2026

వనపర్తి: పకడ్బందీగా జన గణనలో నిర్వహించాలి

image

దేశాభివృద్ధికి ఎంతో కీలకమైన జనాభా గణన తప్పులు లేకుండా చేసేందుకు నిబంధనలపై అధికారులు పూర్తి అవగాహనకలిగి ఉండాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ అన్నారు. వనపర్తి ఐడీఓసీ సమావేశ మందిరంలో మార్చి 15 నుంచి 17 వరకు జిల్లా సెన్సస్ ఛార్జి అధికారులకు నిర్వహిస్తున్న 3రోజుల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశ చరిత్రలో తొలిసారి డిజిటల్ విధానంలో జనాభా గణన మొబైల్ యాప్ ద్వారా చేసుకోవచ్చన్నారు.

News March 17, 2026

SHOCKING: నిమ్మరసానికి గ్యాస్ బిల్లు

image

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో చాలా హోటళ్లు ‘గ్యాస్ క్రైసిస్ ఛార్జ్’ పేరిట అదనంగా వసూలు చేస్తున్నాయి. అయితే గ్యాస్ అవసరమే లేని పదార్థాలకు కూడా ఈ ఛార్జీలను అంటగట్టడం విమర్శలకు దారితీసింది. బెంగళూరులోని ఓ రెస్టారెంట్‌లో కస్టమర్ 2 నిమ్మరసాలు ఆర్డర్ చేయగా రూ.358తో పాటు అదనంగా రూ.17(5%) గ్యాస్ క్రైసిస్ ఛార్జ్ వేశారు. బిల్ ఫొటో వైరలవడంతో జ్యూస్‌కు గ్యాస్ బిల్ వేయడమేంటని నెటిజన్లు మండిపడుతున్నారు.

News March 17, 2026

ఎంజీయూ పీజీ ఫలితాలు విడుదల

image

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలోని పీజీ మూడవ సెమిస్టర్ ఫలితాలను ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మంగళవారం విడుదల చేశారు. ఈ పరీక్షలకు మొత్తం 1,092 మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో 821 మంది ఉత్తీర్ణత సాధించారు. మరో 24 మంది ప్రమోట్ కాగా, 246 మంది విద్యార్థులు ఫెయిల్ అయినట్లు పరీక్షల నియంత్రణ అధికారి (సీఓఈ) జి. ఉపేందర్ రెడ్డి వెల్లడించారు.