News March 12, 2025

నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

☞ ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డికి మంచు మనోజ్ దంపతుల నివాళి
☞ రేపు కోవెలకుంట్ల, నంద్యాల GDCల్లో జాబ్ మేళా
☞ పోసాని విడుదలకు బ్రేక్.. గుంటూరుకు తరలింపు
☞ చెన్నంపల్లెలో భవన నిర్మాణ కార్మికుడి మృతి
☞ యువత పోరులో కలెక్టర్ కు YCP నేతల వినతి
☞ రంగాపురంలో పదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య
☞ తండ్రి మరణం.. పుట్టెడు దుఃఖంలోనూ పరీక్షకు
☞ శ్రీశైలంలో 27 నుంచి ఉగాది మహోత్సవాలు
☞ ఎర్రగుంట్ల PS సస్పెండ్

Similar News

News January 18, 2026

ఇరాన్‌లో లీడర్‌షిప్ మారాలి: ట్రంప్

image

ఇరాన్‌లో కొత్త నాయకత్వం రావాల్సిన సమయం ఆసన్నమైందని US అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ‘సిక్ మ్యాన్’గా సంబోధించిన ఆయన దేశాన్ని హింసతో కాకుండా గౌరవంతో నడపాలని హితవు పలికారు. దేశాన్ని సరిగ్గా ఎలా నడపాలో తన నుంచి నేర్చుకోవాలన్నారు. ఇరాన్ నేతల తీరు వల్ల ఆ దేశంలో సాధారణ ప్రజలు నివసించలేని పరిస్థితి నెలకొందన్నారు.

News January 18, 2026

నెల్లూరోళ్లు రూ.23.17 కోట్ల మద్యం తాగేశారు..!

image

నెల్లూరు జిల్లాలో సంక్రాంతి ఘనంగా జరిగింది. 3రోజులు ప్రజలు ఆహ్లాదంగా గడిపారు. మందుబాబులు మత్తులో మునిగి తేలారు. ఫలితంగా జిల్లాలోని వైన్ షాపులన్నీ కిటకిటలాడాయి. పల్లె, పట్టణమనే తేడా లేకుండా జిల్లా అంతటా మద్యం ఏరులైపారింది. 14 నుంచి 16వ తేదీ రాత్రి వరకు రూ.23.17 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా రూ. 2.06. కోట్ల మేర వ్యాపారం జరిగింది.

News January 18, 2026

KGHలో శవాల మీద డబ్బులు వసూలు..!

image

KGHలో లంచం లేనిదే పని జరగదనే ఆరోపణలు ఉన్నాయి. ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి డిశ్ఛార్జ్ అయ్యే వరకు ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరికి లంచం ఇవ్వాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. ఆఖరికి శవాల మీదా డబ్బులు వసూలు చేస్తున్నారంట. కలెక్టర్ హరేంధిర ప్రసాద్ నిన్న KGHని విజిట్ చేయగా.. శానిటేషన్ వర్కర్ డబ్బులు అడుగుతున్నట్లు రోగి బంధువులు చెప్పడంతో ఆయన మండిపడ్డారు. మీకెప్పుడైనా ఈ సమస్య ఎదురైందా?