News March 12, 2025

ASF: స్త్రీనిధి రుణాలను 100 శాతం రికవరీ చేయాలి: అదనపు కలెక్టర్

image

మహిళా సంఘాల అభివృద్ధిలో భాగంగా అందించే స్త్రీ నిధి రుణాలను 100 శాతం రికవరీ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. బుధవారం ASF కలెక్టరేట్ సమావేశ మందిరంలో మెప్మా సిబ్బందితో స్త్రీ నిధి రుణాల రికవరీ, నూతన రుణాలు జారీ, ప్రమాద బీమా, బ్యాంకు లింకేజీ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మార్చి నెలాఖరుకల్లా స్త్రీ నిధి రుణాల రికవరీ, ఓవర్ డ్యూస్ రికవరీ 100 శాతం పూర్తి చేసే విధంగా చూడాలన్నారు.

Similar News

News March 13, 2025

అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బేబీ ఫీడింగ్ సెంటర్ 

image

అనకాపల్లి, పాయకరావుపేట ఆర్టీసీ బస్టాండ్‌లో బాలింతలు పిల్లలకు పాలు ఇచ్చేందుకు బేబీ ఫీడింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు అనకాపల్లి ప్రజా రవాణా అధికారి కె. పద్మావతి తెలిపారు. అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఓ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో బేబీ ఫీడింగ్ సెంటర్‌ను బుధవారం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బాలింతలు వీటిని వినియోగించుకోవాలని సూచించారు.

News March 13, 2025

పెద్దకొత్తపల్లి: గొంతులో అన్నం అడ్డొచ్చి శ్వాస ఆడక రైతు మృతి

image

అన్నం గొంతులో ఇరుక్కుని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన పెద్దకొత్తపల్లి మండల పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. చంద్రకల్ గ్రామానికి చెందిన బండి గోవింద్ మద్యం తాగిన అనంతరం అన్నం తింటుండగా ముద్ద గొంతులో ఇరుక్కుని ఊపిరాడక మృతిచెందారు. మృతుడి కుమారుడు సిద్ధార్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దకొత్తపల్లి ఎస్ఐ సతీశ్ తెలిపారు. 

News March 13, 2025

HYDలో రేపు మద్యం దుకాణాలు బంద్: సీపీ

image

హోలీ పండుగను పురస్కరించుకొని ఈనెల 14వ తేదీ ఉ.6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి గుంపులు గుంపులుగా తిరుగుతూ.. హంగామా చేస్తే చర్యలు తప్పవని హెచ్చారించారు.

error: Content is protected !!