News March 23, 2024
ఫలితాలు విడుదల
TS: ప్రభుత్వ వెటర్నరీ&ఏనిమల్ హస్బెండరీ విభాగంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. TSPSCలో పరీక్షకు హాజరైన అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ జాబితాలను అందుబాటులో ఉంచారు. ఎంపికైన వారికి త్వరలోనే సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉండనుంది. డిసెంబర్ 22, 2022లో ఈ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 185 పోస్టులు ఉన్నాయి. ఫలితాల కోసం ఇక్కడ <
Similar News
News January 10, 2025
TODAY HEADLINES
*AP: తిరుపతి తొక్కిసలాట బాధితులకు CM, Dy. CM పరామర్శ
*TTD నుంచి ఇద్దరు అధికారుల సస్పెన్షన్, ముగ్గురి బదిలీ
*తొక్కిసలాటపై ప్రభుత్వమే బాధ్యత వహించాలి: YS జగన్
*TG: KTR ఏసీబీ విచారణ పూర్తి
*ఆస్పత్రులతో ప్రభుత్వ చర్చలు సఫలం.. యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు
*ఇందిరమ్మ ఇళ్ల గ్రీవెన్స్‌సెల్ ప్రారంభం
*రేపు కలెక్టర్లతో సీఎం రేవంత్ సమావేశం
*INDIA కూటమి లోక్‌సభ ఎన్నికల కోసమే: INC
* BGT ఓటమిపై త్వరలో BCCI రివ్యూ
News January 10, 2025
90 గంటల పని వ్యాఖ్యలు.. షాకింగ్‌గా ఉందన్న దీపిక
వారానికి 90 గంటలు, ఆదివారాలు కూడా పనిచేయాలన్న L&T ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ <<15106710>>వ్యాఖ్యలపై<<>> హీరోయిన్ దీపికా పదుకొణే స్పందించారు. ‘సీనియర్ పదవుల్లో ఉన్నవారు ఇలాంటి ప్రకటనలు చేయడం చూస్తుంటే షాకింగ్‌గా ఉంది’ అని ఇన్‌స్టాలో పోస్టు చేశారు. #mentalhealthmatters అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించారు. ఉద్యోగ, వ్యక్తిగత జీవితాల మధ్య మానసిక ఆరోగ్యం ముఖ్యమని ఆమె పరోక్షంగా పేర్కొన్నారు.
News January 10, 2025
‘స్వలింగ వివాహాల’పై తీర్పు కరెక్టే: సుప్రీంకోర్టు
స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత నిరాకరిస్తూ తామిచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ తీర్పులో ఎలాంటి తప్పు కనిపించనందున జోక్యం అవసరం లేదని భావిస్తున్నట్లు జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ప్రత్యేక వివాహాల చట్టం కింద స్వలింగ వివాహాలకు రక్షణ కల్పించడం సాధ్యం కాదని 2023 అక్టోబర్‌లో జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.