News March 12, 2025
కేఎల్ రాహుల్-అతియా ఫొటోలు వైరల్

టీమ్ ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ అతి త్వరలో తండ్రి కాబోతున్నారు. వచ్చే నెలలో తమ తొలి సంతానానికి ఆయన భార్య అతియా శెట్టి జన్మనివ్వబోతున్నారు. తన భార్య ఒడిలో సేదతీరుతూ ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. ఈ పిక్స్ చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్ వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా రాహుల్, అతియా 2023 జనవరిలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
Similar News
News March 13, 2025
రోహిత్ తనకంటే జట్టు గురించే ఎక్కువ ఆలోచిస్తారు: సెహ్వాగ్

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిస్వార్థంగా ఆలోచిస్తారంటూ భారత మాజీ క్రికెటర్ సెహ్వాగ్ ప్రశంసించారు. ‘రోహిత్ కెప్టెన్సీని మనం తక్కువ అంచనా వేస్తుంటాం. పలు ఐసీసీ టైటిల్స్ గెలిచిన కెప్టెన్‌గా ఆయన ధోనీ సరసన ఉన్నారు. ఆటగాళ్లతో చక్కటి సమన్వయం, ముందుండి నడిపించడంలో రోహిత్ శైలి అద్భుతం. ఏ ఆటగాడైనా అభద్రతతో ఉంటే అతడిలో విశ్వాసాన్ని నింపుతుంటారు. మొత్తంగా ఆయన తిరుగులేని నాయకుడు’ అని కొనియాడారు.
News March 13, 2025
శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 8 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 68,509 మంది భక్తులు దర్శించుకున్నారు. అదే సమయంలో 23,105 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఒక్క రోజులో స్వామి వారి హుండీ ఆదాయం రూ.3.86 కోట్లు సమకూరింది.
News March 13, 2025
ఢిల్లీలో CM రేవంత్.. ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఫోకస్?

TG CM రేవంత్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఇవాళ కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్‌తో భేటీ కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న పలువురు విదేశాల్లో తలదాచుకుంటుండగా, వారిని స్వదేశానికి రప్పించే విషయంపై ఆయనతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే గల్ఫ్ కార్మికుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నారు. అనంతరం పార్టీ అధిష్ఠానంతో మంత్రి వర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై చర్చించే అవకాశముంది.