News March 12, 2025

ఎస్.రాయవరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

image

ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు వద్ద జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. పెనుగొల్లు గ్రామానికి చెందిన చందాక రాము (58) అడ్డరోడ్డు గ్రామం నుంచి స్వగ్రామం వెళ్లేందుకు బైక్ పై యూటర్న్ తీసుకుంటుండగా అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న మరో బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాము అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై విభీషణరావు తెలిపారు. కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News November 5, 2025

విమాన ప్రయాణికులకు శుభవార్త

image

విమాన టికెట్ల రద్దు అంశంపై ప్రయాణికులకు DGCA గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్లు బుక్ చేసుకున్న 48 గంటల్లోపు ఎలాంటి ఛార్జీ లేకుండా రద్దు చేసుకోవడం/ప్రయాణ తేదీని మార్చుకునే అవకాశాన్ని కల్పించింది. క్రెడిట్ కార్డు ద్వారా అయితే 7 రోజుల్లో, ట్రావెల్ ఏజెంట్/పోర్టల్ ద్వారా బుక్ చేసుకుంటే 21 పనిదినాల్లో రిఫండ్ అందుతుంది. దేశీయ విమానాల్లో ప్రయాణానికి 5D, ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లలో 15D లోపు ఈ సౌకర్యం వర్తించదు.

News November 5, 2025

శ్రీరాంపూర్: సింగరేణిలో పలువురు అధికారుల బదిలీ

image

సింగరేణిలో పలువురు అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జైపూర్‌లోని ఎస్టీపీపీ డీజీఎం ఉమాకాంత్ కార్పొరేట్‌కు, ఈఈ స్వీకర్ శ్రీరాంపూర్ ఏరియా వర్క్‌షాప్‌కు బదిలీ చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఈఈ రాకేష్ ఎస్టీపీపీకి, ఆర్కే ఓసీ ఈఈ అనుదీప్‌ కేకే ఓసీకి, జేఈ శ్రీనివాసరావును కొత్తగూడెంకు, మందమర్రి డీవైపీఎం ఆసిఫ్‌ను ఆర్జీ 3కి, శ్రీరాంపూర్ సీనియర్ పీఓ కాంతారావును కార్పోరేట్‌కు బదిలీ చేశారు.

News November 5, 2025

ఈ ఫేస్ ప్యాక్‌తో ఎన్నో లాభాలు

image

పెరుగు, శనగపిండి, పసుపు మూడు కలిసి తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నాయి. వీటిని కలిపి ప్యాక్‌లా తయారుచేసుకుని ముఖానికి, చర్మానికి పట్టించడం వల్ల సౌందర్యం పెరుగుతుంది. చర్మంపై చేరే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. చర్మంపై ముడతలు, మచ్చలు రాకుండా ఉంటాయి. కెమికల్ క్రీములు వాడే బదులు వీటిని వాడటం వల్ల చర్మ సౌందర్యాన్ని సులువుగా పెంచుకోవచ్చని చెబుతున్నారు.