News March 12, 2025
PPM: ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకు 426 మంది గైర్హాజరు

ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలకు బుధవారం 426 గైర్హాజరైనట్లు DVEO మంజులా వీణ తెలిపారు. పార్వతీపురం జిల్లావ్యాప్తంగా 34 పరీక్షా కేంద్రాల్లో 8,598 మంది విద్యార్థులు పరీక్షలు రాయవలసి ఉండగా 8,172 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. 5,660 మంది జనరల్ విద్యార్థులకు గాను 5,465 మంది విద్యార్థులు హాజరయ్యారు. 2,938 ఒకేషనల్ విద్యార్థులకు 2,707 మంది పరీక్ష రాశారని చెప్పారు.
Similar News
News March 14, 2025
బోరుగడ్డకు 14 రోజుల రిమాండ్

AP: రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్‌కు కోర్టు రిమాండ్ విధించింది. జైలులో లొంగిపోయిన ఆయనను పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకున్న చిలకలపూడి పోలీసులు అదనపు జిల్లా జడ్జి ముందు హాజరుపరిచారు. చిలకలపూడి పీఎస్‌లో నమోదైన కేసుల్లో అనిల్‌కు ఈ నెల 27 వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
News March 14, 2025
సిరిసిల్ల: వాహనం, డ్రైవర్ కు దరఖాస్తులు ఆహ్వానం

24/7 అందుబాటులో ఉండేలా వాహనం, డ్రైవర్ ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో గురువారం ఆయన ప్రకటన విడుదల చేశారు. సొంత ఏసి వాహనం, వాహనానికి డ్రైవర్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. ఆసక్తి గలవారు ఈనెల 12వ తేదీ నుండి 18వ తేదీ వరకు కలెక్టరేట్లోని 33 వ నంబర్ రూమ్ లో సంప్రదించాలని ఆయన కోరారు.
News March 14, 2025
గుడిహత్నూర్‌లో యువకుడి సూసైడ్

ఆనుమానాస్పద స్థితిలో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గుడిహత్నూర్‌లో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండల కేంద్రనికి చెందిన ఉప్పులేటి రవి గురువారం రాత్రి గ్రామ సమీపంలో చెట్టుకు ఉరేసుకొని మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చెరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించినట్లు ఎస్ఐ మహేందర్ తెలిపారు.