News March 12, 2025
GWL: అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: కలెక్టర్

జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని గద్వాల కలెక్టర్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉపాధి హామీ, తాగునీరు, ఇందిరమ్మ ఇండ్లు, LRS ప్రక్రియ గురించి సమావేశం నిర్వహించారు. ఉపాధి పనులు నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా ఉండకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు తాగునీటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాటు చేసుకోవాలన్నారు.
Similar News
News March 13, 2025
బొమ్మలరామారంలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత.. ఎల్లో అలర్ట్ జారీ

యాదాద్రి జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. నాలుగు రోజుల క్రితం వరకు 36 నుంచి 37 డిగ్రీలున్న ఉష్ణోగ్రత 40.3 డిగ్రీలకు పెరిగింది. తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. బొమ్మలరామారం మండలంలో బుధవారం 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
News March 13, 2025
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బద్నావర్-ఉజ్జయిని హైవేపై గ్యాస్ ట్యాంకర్ అదుపు తప్పి కారు, పికప్ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
News March 13, 2025
MHBD: ప్రేమగా మారిన మూగ పరిచయం

మూగవారే.. అయితేనేం. ప్రేమించుకున్నారు. వివాహంతో ఒక్కటయ్యారు. MHBD జిల్లా గార్ల మండలానికి చెందిన అశ్విన్‌సాయి, తూర్పుగోదావరి(ఏపీ) జిల్లాకు చెందిన బుజ్జి ఇద్దరు మూగవారే. రెండేళ్ల క్రితం ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా చిగురించింది. ఇంట్లో పెద్దలను ఒప్పించి బుధవారం గార్లలో వివాహం చేసుకున్నారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు.