News March 12, 2025
సిద్దిపేట: సమాజంలో మహిళల పాత్ర కీలకం: సీపీ

సమాజ నిర్మాణంలో మహిళలే కీలకమని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం పట్టణ త్రీ టౌన్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళల దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ పాల్గొని మాట్లాడారు. సమాజంలో మహిళలు అని రంగాల్లో రానిస్తున్నారని అన్నారు.
Similar News
News November 9, 2025
పర్వతగిరి: Way2News కథనానికి స్పందన

Way2News కథనానికి స్పందన లభించింది. శ్యామా ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ పథకంలో భాగంగా పర్వతగిరి మండలంలోని కొంకపాక గ్రామ శివారులో నిర్మించిన మూడు వేల మెట్రిక్ టన్నుల గోదామును వినియోగించాలని కలెక్టర్ సత్యశారద అధికారులకు సూచించారు. పథకంలో భాగంగా నిర్మించిన గోదాములు నిరుపయోగంగా ఉంటున్నాయని గతంలో Way2News ప్రచురించిన కథనానికి స్పందిస్తూ.. ప్రస్తుత అవసరాలకు గోదామును వినియోగించాలని కలెక్టర్ సూచించారు.
News November 9, 2025
నాన్‌వెజ్ వండేటపుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

వంటగదిలో ఎంత శుభ్రత పాటించినా బ్యాక్టీరియా, వైరస్‌లు విజృంభిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా నాన్‌వెజ్ వండే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. మాంసాహారంపై ఉండే హానికర బ్యాక్టీరియా కిచెన్‌లో వృద్ధిచెంది మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి నాన్‌వెజ్ వండే ముందు, వండేటప్పుడు, వండిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. మాంసాన్ని కడిగేటప్పుడు చేతులకు గ్లౌజ్‌లు వేసుకోవాలి. నాన్‌వెజ్ పాత్రలు విడిగా ఉంచాలి.
News November 9, 2025
అచ్చంపేట: నిబంధనలకు పాతర.. సీసీ రోడ్డు వేశారు

అచ్చంపేట పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా నుంచి లింగాల రోడ్డులో 400 మీటర్లు రోడ్డు మధ్యలో డివైడర్ నిర్మాణానికి 10 ఏళ్ల క్రితం రోడ్డు మధ్యలో R/B అధికారులు స్థలం వదిలేశారు. నిబంధనలకు విరుద్ధంగా మునిసిపల్ అధికారులు రోడ్డు మధ్యలో సిసి రోడ్డు వేశారు. ఇరువైపులా వ్యాపార దుకాణాలు ఉన్నాయి. వాహనాలు రోడ్డులో పార్కింగ్ చేస్తున్నారు. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని రోడ్డు వెడల్పు చేయాలని ప్రజలు కోరుతున్నారు.


