News March 13, 2025

MBNR: ప్రశాంతంగా కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలు

image

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. నేడు జిల్లా వ్యాప్తంగా మ్యాథ్స్ ,బాటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలు నిర్వహించారు. నేడు మొత్తంగా 10,640 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావలసి ఉండగా కేవలం 10,380 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 209 మంది జనరల్,51 మంది ఒకేషనల్ విద్యార్థులు మొత్తంగా 260మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు అధికారులు వెల్లడించారు.

Similar News

News November 11, 2025

సీసీ కుంట: కురుమూర్తి జాతరలో రోడ్డు ప్రమాదం

image

చిన్నచింతకుంట మండలం అమ్మాపురంలోని శ్రీ గురుమూర్తి స్వామి జాతర మైదానంలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వెళ్తున్న బైక్, ఆటో ఢీకొనడంతో పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం ఇచ్చినా ఆలస్యం కావడంతో క్షతగాత్రులను ప్రైవేట్ వాహనంలో జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. గాయపడినవారు డోకుర్ బైక్, పేరూరు ఆటో డ్రైవర్లుగా పోలీసులు గుర్తించారు.

News November 11, 2025

జడ్చర్ల: విద్యార్థి పై దాడి..బాలల హక్కుల సంఘానికి ఫిర్యాదు

image

జడ్చర్ల పట్టణంలోని స్వామి నారాయణ గురుకుల పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థిని కొట్టడంతో కర్ణభేరి దెబ్బతిని చెవికి గాయమైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు కారణమైన ఉపాధ్యాయుడిపై, పాఠశాలపై చర్యలు తీసుకోవాలని స్థానిక న్యాయవాది పెద్దింటి రవీంద్రనాథ్ బాలల హక్కుల సంఘానికి, మానవ హక్కుల సంఘానికి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. బాధిత విద్యార్థికి తక్షణమే న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

News November 11, 2025

MBNR: ఖో-ఖో సెలక్షన్స్.. విజేతలు వీరే..!

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14 విభాగంలో బాల, బాలికలకు ఖో-ఖో ఎంపికలు నిర్వహించారు. మొత్తం 550 మంది క్రీడాకారులు పాల్గొనగా.. ఎంపికైన వారిని ఉమ్మడి జిల్లా స్థాయికి పంపించారు.
✒బాలికల విభాగం
1)మొదటి బహుమతి:బాలానగర్
2)రెండవ బహుమతి:మహమ్మదాబాద్
✒బాలుర విభాగం
1)మొదటి బహుమతి:నవాబ్ పేట్
2)రెండో బహుమతి:కోయిలకొండ