News March 13, 2025
ఒక్కో మ్యాచ్‌కు రూ.3,110 ఫీజు: ఆటగాళ్లకు PCB షాక్

ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించి తీవ్ర నష్టాల్లో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ టీ20 కప్‌లో పాల్గొనే దేశవాళీ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులను భారీగా కుదించింది. గతంలో ఒక్కో మ్యాచ్‌కు 40 వేల పాకిస్థానీ రూపాయలు (భారత కరెన్సీలో రూ.12 వేలు) ఇచ్చేది. ఇప్పుడు దానిని 10 వేలకు (భారత కరెన్సీలో రూ.3,110) తగ్గించింది. అలాగే చీప్ హోటళ్లలో బస, విమాన ప్రయాణాలపై కూడా ఆంక్షలు విధించింది.
Similar News
News March 13, 2025
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బద్నావర్-ఉజ్జయిని హైవేపై గ్యాస్ ట్యాంకర్ అదుపు తప్పి కారు, పికప్ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
News March 13, 2025
ఇంటర్ పేపర్లలో తప్పులు.. విద్యార్థుల ఆందోళన

TG: ఇంటర్ క్వశ్చన్ పేపర్లలో తప్పులు దొర్లుతుండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. నిన్న సెకండియర్ బోటనీలో 2, గణితంలో ఒక తప్పు, మంగళవారం ఫస్టియర్ పేపర్లలో 3 సబ్జెక్టుల్లో 6 తప్పులు దొర్లాయి. సోమవారం సెకండియర్ ఇంగ్లిష్ పేపర్ అస్పష్టంగా ముద్రించడంతో ఏడో ప్రశ్నకు 4 మార్కులు ఇస్తామని బోర్డు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇలాంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్టూడెంట్స్, పేరెంట్స్ కోరుతున్నారు.
News March 13, 2025
ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు రష్యాకు US అధికారులు

ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో కాల్పుల విరమణపై మధ్యవర్తిత్వం చేసేందుకు అమెరికా అధికారులు రష్యా బయలుదేరారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయాన్ని తెలిపారు. ‘మా వాళ్లు రష్యాకు వెళ్లే దారిలో ఉన్నారు. ఈ చర్చలకు మాస్కో సహకరిస్తుందని ఆశిస్తున్నాం. అదే జరిగితే 80శాతం మేర ఈ నరమేధం ఆగినట్లే. అలా కాని పక్షంలో రష్యాను కుదేలుచేసే ఆంక్షలు విధించగలను. కానీ అంతవరకూ రాదని అనుకుంటున్నా’ అని స్పష్టం చేశారు.