News March 13, 2025
NRPT: ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 86 మంది గైర్హాజరయ్యారు

నారాయణపేట జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగినట్లు ఇంటర్ విద్య జిల్లా నోడల్ అధికారి దర్శనం వెల్లడించారు. జనరల్ విద్యార్థులు 3,527 మందికి, 3460 మంది హాజరుకాగా, 67 మంది గై హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 547 మందికి 528 మంది పరీక్షలకు హాజరయ్యారు. 19 మంది గై హాజరైనట్లు తెలిపారు. వివిధ మండలాలను ప్లేయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయి.
Similar News
News November 5, 2025
బంధంలో బ్యాలెన్స్ ముఖ్యం

అన్యోన్యంగా జీవితాన్ని సాగించాలనుకునే దంపతులు పట్టు విడుపులు సమానంగా పాటించాలి. అంతేగానీ బంధాన్ని నిలబెట్టుకోవాలన్న తాపత్రయంతో అవతలి వారి తప్పులను క్షమిస్తూ పోతే మీ జీవితాన్ని మీరే పాడుచేసుకున్నట్లవుతుంది. సున్నితమైన విషయాలను నిర్లక్ష్యం చేయడం వల్ల మీ జీవితం మీకు తెలీకుండానే చేజారే అవకాశం ఉంది. బంధమేదైనా అన్ని రకాలుగా బ్యాలన్స్డ్గా ఉంటేనే కలకాలం నిలుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
News November 5, 2025
ADB: పిల్లర్ పడి బాలుడి దుర్మరణం

ఆడుకుంటున్న బాలుడిపై ప్రమాదవశాత్తు పిల్లర్ పడి దుర్మరణం చెందిన విషాద ఘటన బేల మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఇంద్ర నగర్‌కు చెందిన దౌరే వీర్(7) బుధవారం ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న బాలుడిపై ఒక్కసారిగా పిల్లర్ పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.
News November 5, 2025
సంగారెడ్డి: ఘోర రోడ్డు ప్రమాదం.. మృతులు వీరే.! (UPDATE)

కర్ణాటక రాష్ట్రం హాలికెడ్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నారాయణఖేడ్ మండలం జగన్నాథ్‌పూర్ గ్రామానికి చెందిన <<18203736>>నలుగురు వ్యక్తులు మృతి <<>>చెందారు. గానుగాపూర్ దత్తాత్రేయ స్వామి క్షేత్రాన్ని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులు నాగరాజు (35), నవీన్ (40), రాచప్ప (45), కాశీనాథ్ (60)తో ప్రతాప్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.


