News March 13, 2025
కళ తప్పిన గోవా టూరిజం.. కారణాలు ఇవే!

ఒకప్పుడు విదేశీ పర్యాటకులతో కళకళలాడిన గోవా ప్రస్తుతం వెలవెలబోతోంది. 2019లో 85 లక్షల మంది రాగా, 2023లో 15 లక్షల మంది మాత్రమే సందర్శించారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆగ్నేయాసియాలో మరింత తక్కువ ధరలకు పట్టణాలు అందుబాటులో ఉండడం, గోవాలో ఆటో, ట్యాక్సీ మాఫియా, ఇక్కడ జీవన వ్యయం పెరగడం వల్ల విదేశీ టూరిస్టులు తగ్గారని సమాచారం. దీనిని పెంచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది.
Similar News
News March 14, 2025
బోరుగడ్డకు 14 రోజుల రిమాండ్

AP: రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్కు కోర్టు రిమాండ్ విధించింది. జైలులో లొంగిపోయిన ఆయనను పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకున్న చిలకలపూడి పోలీసులు అదనపు జిల్లా జడ్జి ముందు హాజరుపరిచారు. చిలకలపూడి పీఎస్లో నమోదైన కేసుల్లో అనిల్కు ఈ నెల 27 వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
News March 14, 2025
ఈ రోజు నమాజ్ వేళలు

మార్చి 14, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున 5.13 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.25 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.26 గంటలకు
ఇష: రాత్రి 7.38 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 14, 2025
IMLT20: సెమీస్లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20 సెమీఫైనల్ మ్యాచులో ఆస్ట్రేలియాపై భారత జట్టు ఘన విజయం సాధించి ఫైనల్ దూసుకెళ్లింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా మాస్టర్స్ 20 ఓవర్లలో 220 పరుగులు చేసింది. యువరాజ్(59), టెండూల్కర్(42), బిన్నీ(36) అదరగొట్టారు. ఛేదనలో భారత బౌలర్లు నదీమ్(4), వినయ్(2), పఠాన్(2) విజృంభించడంతో ఆస్ట్రేలియా 126 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇండియా మాస్టర్స్ ఫైనల్లోకి ప్రవేశించింది.